పోలవరం పర్యటనకు వెళ్ళిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే స్వయంగా పోలవరం వద్దనే అధికారులతో మాట్లాడారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రం సుభిక్షం అవుతుందన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి కృష్ణా లను అనుసంధించామన్న ఆయన బొల్లాపల్లి రిజర్వాయర్ వచ్చి బనక చర్ల తీసుకెళ్తే రాష్ట్ర అంతా నీటి కొరత తీరుతుందని గోదావరి నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కు నీరు వెళ్తే అన్నీ ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయన్నారు.
Also Read : సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త సరికొత్త రికార్డు.. కారణమేంటి?
చైనా లోని త్రీ గార్జెస్ డాం కంటే ఎక్కువ డిశ్చార్జ్ పోలవరం నుంచి ఉంటాయన్నారు. 2019 లోపే ఎగువ, దిగువ కాఫర్ డ్యాం లు, డయా ఫ్రం వాల్, స్పిల్ వే అన్నీ 73 శాతం పూర్తి చేశామన్న ఆయన వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే బలవంతంగా కాంట్రాక్టర్ ను, అధికారులను మార్చేసారన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరాన్ని 15 నెలలు ఆపేసి గోదావరి లో కలిపేశారని అదే సమయంలో వరదలు రావడంతో డయా ఫ్రం వాల్ తో పాటు అన్నీ గోదావరిలో కొట్టుకుపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.
అవినీతి, కుట్ర, నిర్లక్ష్యం అన్నీ వైఎస్ఆర్సీపీ ఆలోచనల్లో ఉన్నాయన్నారు. ఈ అవినీతి, నిర్లక్ష్యం, కుట్ర ఖరీదు 2400 కోట్లు అదనంగా భారం పడుతుందని అది కాకుండా అప్పటికి ఇప్పటికి పెరిగిన ధరలతో కొన్ని వేల కోట్ల అదనపు ఖర్చన్నారు. 2026 జూన్ లోపే డయా ఫ్రం వాల్, ఈ సీ అర్ ఎఫ్ డ్యాం లు పూర్తి చేస్తామన్నారు. కుడి, ఎడమకాలువల కనెక్టివిటీ ఒకటిన్నర సంవత్సరం లో పూర్తిగా కాలువల నిర్మాణం జరుగుతున్నారు.
Also Read : వైసీపీ నేతలను గుండెల్లో పెట్టుకున్న టీడీపీ
స్పిల్ ఛానెల్ 2026 జూన్, 2027 ఫిబ్రవరి ఇరిగేషన్ టన్నెల్ పనులు, ట్విన్ టన్నెల్స్ 2026 లోపు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 2025 లో పెండింగ్ ఉన్న సుమారు 17 వేల ఎకరాల భూ సమీకరణ జరుపుతామని 2026 ఏప్రిల్ కు పునరావాస కార్యక్రమాల పూర్తి చేస్తాం అన్నారు. 2026 అక్టోబర్ నాటికి మొత్తం ప్రాజెక్టు పూర్తి చేయాలనీ లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

