Wednesday, March 25, 2026 12:20 AM
Wednesday, March 25, 2026 12:20 AM

నీళ్ళపై రాజకీయం ఆపండి.. తెలంగాణాకు చంద్రబాబు కౌంటర్

ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్ట్ ను సిఎం చంద్రబాబు సీరియస్ గా తీసుకుని అడుగులు వేస్తోన్న సంగతి తెలిసిందే. 2019 నుంచి 2024 వరకు పోలవరం పనులు జరగని నేపధ్యంలో ఇప్పుడు చంద్రబాబు సీరియస్ ఫోకస్ చేసారు. అటు కేంద్రం కూడా భారీగా నిధులు కేటాయిస్తూ వస్తోంది. ఈ నేపధ్యంలో తాజాగా చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ వద్దకు వెళ్ళారు. పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు సిఎం. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు చంద్రబాబు.

Also Read : ఎవడ్నీ వదలను.. లోకేష్ హాట్ కామెంట్స్

వైసీపీ పోలవరం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. టీడీపీ అధికారంలో ఉంటే గతంలోనే పూర్తయ్యేదన్నారు. వైసీపీ హయాంలో డయాఫ్రమ్ వాల్‌ కూడా కాపాడలేకపోయారని, మేం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టామన్నారు. 2027 మార్చి నాటికి ఫేజ్-1 పనులు పూర్తి అవుతాయన్నారు. ఆ తరువాత ఫేజ్-2 పనులపై దృష్టి పెడతామని స్పష్టం చేసారు. వచ్చే ఏడాది మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలనేది లక్ష్యమన్నారు.

Also Read : అమిత్ షాతో చంద్రబాబు హడావుడి భేటీ.. కారణమేంటి?

ఇక రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదంపై సిఎం చంద్రబాబు స్పందించారు. నీళ్లపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు. దేవాదుల కట్టాం.. అది గోదావరి పైన ఉంది.. అక్కడి నుంచి పోలవరానికి నీళ్లు వస్తాయి.. పోలవరం నుంచి నీళ్లు తీసుకుంటాం అంటే అభ్యంతరం పెడితే ఎలా? అని నిలదీశారు. గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి.. గోదావరిలో మిగిలే నీళ్లతో రాయలసీమకు నీళ్లు ఇవ్వొచ్చన్నారు. ఏపీ గోదావరి నీళ్లు వాడుకుంటే.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో నీళ్లను తెలంగాణ కూడా వాడుకోవచ్చని తెలిపారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: డేంజర్ జోన్...

ఏపీలోని బెజవాడ నగరం వేదికగా సాగుతున్న...

బ్రేకింగ్: మాట నిలబెట్టుకున్న...

గత కొన్ని రోజులుగా విమర్శలు ఎదుర్కొంటున్న.....

ఏపీపై రైల్వే శాఖ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి...

బాబోయ్.. బెజవాడలో ఉగ్రవాదులు..!

విజయవాడ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విజయవాడలో...

బ్రేకింగ్: ఐటీ రంగంపై...

అమెరికా, ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం...

దానంపైనే బీఆర్ఎస్ గురి..?...

2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత.....

పోల్స్