తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పేద కుటుంబాల కోసమే ఉగాదినాడు పి4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు సిఎం చంద్రబాబు నాయుడు. బాపట్ల జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. కార్యకర్తలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈ రాష్ట్రంలో దగ్గర దగ్గర ప్రతి రెండున్నర కుటుంబాలకు పింఛన్ ఇస్తున్నామని అన్నారు. కోటి 50 లక్షల కుటుంబాలు ఉంటే 64 లక్షల పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ ఒక్క కార్యక్రమానికి 3,300 కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతుందన్నారు.
Also Read : హైదరాబాద్ ను వేటాడుతున్నాడు..!
భారతదేశంలో ఎక్కడ ఈ స్థాయిలో పంపిణీ లేదన్నారు చంద్రబాబు. గత ప్రభుత్వ హయాంలో నొక్కిన బటన్ లు మెత్తం మేము ఇచ్చే పింఛన్లతో సమానమని వ్యాఖ్యానించారు. పోలవరం, అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు చంద్రబాబు. విశాఖ ఉక్కు పరిశ్రమ సమస్య పరిష్కారం చూపామని తెలిపారు. పెంచిన ఆదాయం నిరంతరం పేదవారికి ఖర్చు పెడతానని స్పష్టం చేసారు. ఈ గ్రామంలోని చదువుకోని యువతకు గొర్రెలు పెంచుకునేందుకు అనువైన సదుపాయలు కల్పిస్తామన్నారు చంద్రబాబు.
Also Read : సినిమాని చంపెయ్యకండి.. మీడియాపై నిర్మాత ఫైర్
ఆర్థిక భారమైనా తల్లికి వందనం ద్వారా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామమని స్పష్టం చేసారు. మత్స్యకారులకు ఏప్రిల్ లో 20,000 అందిస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి పని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆయన ఇంటిదగ్గర ఉండి పని చేసే వారికి వర్క్ హోం కల్పిస్తామని తెలిపారు. మార్గదర్శి- బంగారు కుటుంబం కార్యక్రమం ద్వారా పేదరికం నిర్మూలిస్తామని అన్నారు. ఇంటింటికి సౌర విద్యుత్ ద్వారా మోడల్ గ్రామంగా మార్చాలన్నారు. తాగునీరు, డ్రైనేజీ, వంట గ్యాస్, ఇంటర్ నెట్ అన్ని సౌకర్యాలు కల్పిస్తాం కల్పిస్తామని… నిర్దిష్ట కాలంలో అన్ని ఏర్పాట్లు చేయాలనీ కలెక్టర్ ను ఆదేశిస్తున్నానన్నారు.

