Wednesday, February 4, 2026 12:27 PM
Wednesday, February 4, 2026 12:27 PM

కూన ఎపిసోడ్‌లో కులం రచ్చ..!

ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎపిసోడ్ ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఎమ్మెల్యే కూన తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఆమె ఆత్మహత్యకు యత్నించారు. దీంతో ఈ వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. అమెరికాలో ఉన్న కూన.. ఆఘమేఘాల మీద ఆముదాలవలస చేరుకున్నారు. ఇదంతా తనను అడ్డుకునేందుకు జరుగుతున్న కుట్ర అని కొట్టి పారేశారు. తనకు వ్యతిరేకంగా ఓ వర్గం పని చేస్తోందని ఆరోపించారు.

Also Read : రోజు రెండు వెల్లుల్లి రెబ్బలు.. జీవితమే మారిపోతుందా..?

కూన రవికుమార్ వ్యవహారం ఇప్పుడు సిక్కోలు జిల్లాలో రెండు వర్గాల మధ్య పోరుకు తెర లేపింది. శ్రీకాకుళం జిల్లాలో తొలి నుంచి కాళింగ, వెలమ సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇదే సమయంలో జిల్లా రాజకీయాల్లో ఆ రెండు కుటుంబాలే పెత్తనం చేస్తున్నాయనేది తొలి నుంచి వినిపిస్తున్న ఆరోపణ. ఇందులో భాగంగానే 2024 ఎన్నికల్లో తమకు అనుకూలమైన వారికే ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇప్పించారనేది సీనియర్ల ఆరోపణ. కేవలం అధినేతను తప్పుదోవ పట్టించటం వల్లే తమకు టికెట్లు రాలేదని శ్రీకాకుళం, పాతపట్నం మాజీ ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, కలమట వెంకటరమణ ఆరోపిస్తున్నారు. సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావుకు కూడా ఎచ్చెర్ల నియోజకవర్గంలో టికెట్ రాకుండా అడ్డుకున్నారనే మాట వినిపిస్తోంది. కేవలం టీడీపీ హవాలో భాగంగానే శ్రీకాకుళం, పాతపట్నం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలిచారనేది బహిరంగ రహస్యం.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది ప్రస్తుతం ఆ సీనియర్ నేత కంట్రోల్‌లోనే ఉన్నారు. మిగిలిన కూన రవికుమార్ మాత్రం ఇప్పటి వరకు ఆ సీనియర్‌ను జీ హుజూర్ అనటం లేదు. పైగా జిల్లా సమీక్ష సమావేశాల్లో కూడా గట్టిగానే తన స్వరం వినిపిస్తున్నారు. నేరుగా పార్టీ అధినేతతోనే సంప్రదింపులు చేస్తున్నారు. దీంతో కూన తమకు కంట్లో నలుసుగా మారాడనేది సీనియర్ నేత ఆలోచన. పైగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై గెలిచిన కూనకు మంత్రి పదవి ఖాయమనే మాట వినిపిస్తోంది. అదే జరిగితే.. తమ ఆధిపత్యానికి బ్రేక్ ఖాయమని తన సన్నిహితుల దగ్గర సీనియర్ నేత వ్యాఖ్యానించినట్లు సమాచారం.

Also Read : నా భార్యతో రాజీనామా చేయిస్తా.. నీకు ఆ దమ్ముందా జగన్..?

కూన రవికుమార్‌ను టార్గెట్ చేసిన సదరు సీనియర్ నేత.. వైసీపీ నేత ధర్మాన బ్రదర్స్‌తో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. వాస్తవానికి సౌమ్య గురించి జిల్లాలో అందరికీ తెలుసు. గతంలో కళా వెంకట్రావు మంత్రిగా ఉన్న సమయంలోనే సౌమ్యపై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ కూడా తమ ప్రభుత్వ హయాంలో సౌమ్య తీరుపై కలెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. అయితే ప్రతిసారి కులం కార్డు వాడుతున్న సౌమ్య.. దళితులపై వేధింపులంటూ తప్పించుకుంటున్నారు. కూన విషయంలో కూడా ఇదే డ్రామా నడిపిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌కు నైటీతో రావడంతో కూన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని రికార్డు చేసిన సౌమ్య.. తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. వాస్తవానికి ఆ వీడియోలో సౌమ్యతో పాటు మరో ముగ్గురు ప్రిన్సిపాల్స్ కూడా ఉన్నారు. వాళ్లు మాత్రం కూనకు అనుకూలంగానే వాంగ్మూలం ఇస్తున్నారు.

Also Read : సాక్షికి లీగల్ నోటీసులు..!

కూన ఎపిసోడ్‌లో ఇప్పటి వరకు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చి మాట్లాడే ధైర్యం చేయటం లేదు. ఇందుకు ప్రధాన కారణం.. సదరు సీనియర్ నేత ఆగ్రహానికి గురైతే.. తన రాజకీయ భవిష్యత్తు ఏమిటనే భయంతో బయటకు రావటం లేదని చెబుతున్నారు. దీంతో ఈ పోరాటంలో కూన పూర్తిగా ఒంటరి అయ్యారని అంతా భావిస్తున్నారు. ఇదే సమయంలో అనూహ్యంగా కూనకు పార్టీలకు అతీతంగా కాళింగ సామాజిక వర్గానికి చెందిన నేతలు మద్దతు తెలుపుతున్నారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూనకు మద్దతు తెలిపారు. వైసీపీ అధినేత జగన్‌కు ధర్మాన బ్రదర్స్ తప్పుడు ఫీడ్ బ్యాక్ ఇచ్చారని.. అందుకే ఆయన సౌమ్యను పరామర్శించాలంటూ ఎస్సీ నేతలను పంపించారనేది దువ్వాడ ఆరోపణ. సౌమ్యను వైసీపీకి చెందిన మేరుగ నాగార్జునతో పాటు జిల్లాకు చెందిన పలువురు ఎస్సీ నేతలు కూడా పరామర్శించారు. కానీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాత్రం.. ఈ పరామర్శ పర్యటనలో కనిపించలేదు. దీంతో వైసీపీలో కూడా కాళింగ, వెలమ నేతల మధ్య పోరాటం బహిర్గతమైందనేది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

పోల్స్