Sunday, March 22, 2026 05:13 AM
Sunday, March 22, 2026 05:13 AM

పరకామణిలో దొంగలు ఈ పోలీసులేనా..?

పరకామణి చోరీ వ్యవహారానికి సంబంధించి ఏపీ పోలీసులు దూకుడుగా ముందుకు వెళ్తోన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో టీటీడీ అధికారులతో పాటుగా రాజకీయ నాయకుల పాత్ర కూడా ఉన్న నేపధ్యంలో ప్రభుత్వం సైతం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. ఇక కేసు విచారణ జరిగిన ప్రతీసారి హైకోర్ట్ ఘాటు వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఏపీ హైకోర్ట్ లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పోలీసు అధికారుల పాత్రపై హైకోర్ట్ సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. కీలక ఆదేశాలు ఇచ్చింది.

Also Read : ఏపీలో అసలేం జరుగుతోంది..?

ఈ కేసులో కేవలం దొంగతనం చేసిన వారే కాకుండా, వారికి సహకరించిన పోలీసు అధికారుల పాత్రపై అసహనం వ్యక్తం చేసిన కోర్ట్.. పరకామణిలో భక్తులు సమర్పించిన కానుకల చోరీ కేసును విచారిస్తున్న సందర్భంగా, నిందితులతో అప్పటి పోలీసు అధికారులకు ఉన్న సంబంధాలపై విచారణ సందర్భంగా కోర్ట్ ప్రశ్నించింది. దొంగతనానికి పాల్పడిన వారితో కొందరు పోలీసులు చేతులు కలిపినట్లు ప్రభుత్వం కోర్టుకు వివరించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్ట్.. రక్షించాల్సిన వారే భక్షకులతో చేతులు కలపడం క్షమించరాని నేరమని అసహనం వ్యక్తం చేసింది.

పరకామణి చోరీ కేసులో నిందితులతో కుమ్మక్కైన పోలీసు అధికారులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. విధుల్లో నిర్లక్ష్యం వహించి, నేరస్తులకు సహకరించిన సంబంధిత పోలీసులపై తక్షణమే కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇదిలా ఉంచితే.. పరకామణి చోరీ కేసులో అప్పటి సీఐ జగన్ మోహన్ రెడ్డి, టూ టౌన్ సీఐ చంద్రశేఖర్ ప్రమేయం ఉన్నట్లుగా భావిస్తున్నారు. నిందితుడు రవికుమార్ ఆస్తులు పరిశీలించిన ఎసై లక్ష్మీ రెడ్డికి కూడా కేసుతో ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు.

Also Read : చెల్లెమ్మను ఎలా దారిలో పెట్టాలి..?

ఇప్పటికే ఈ ముగ్గురిని వీఆర్‍కు పంపిన పోలీసుశాఖ.. హైకోర్టు తాజా ఆదేశంతో ముగ్గురిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనుంది ఏపీ సీఐడీ. కేసుకు సంబంధించి కొన్ని పత్రాలు తారుమారు చేశారనే అభియోగాలు ఎదుర్కొంటున్న వన్‍టౌన్ సీఐ విజయ్ కుమార్ పై కూడా కేసు నమోదు చేయనుంది. అయితే వన్‍టౌన్ సీఐ విజయ్ కుమార్‍పై కేసు నమోదు చేస్తారా? లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్