Wednesday, February 4, 2026 12:43 PM
Wednesday, February 4, 2026 12:43 PM

భారత రాష్ట్ర సమితి పేరు మారుతోంది..?

తెలంగాణా రాజకీయాల్లోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలంగాణా రాష్ట్ర సమితి.. నయా భారత రాష్ట్ర సమితి ఓ సంచలనమే. తెలంగాణా వాదంతో ఆవిర్భవించిన ఓ ఉప ప్రాంతీయ పార్టీ, అధికారంలోకి రావడం, ఏకంగా పదేళ్ళ పాటు నిర్విరామంగా ఏలడం చూసాం. రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు, వ్యక్తిగతంగా పార్టీ అధినేత కేసీఆర్ కు ఇబ్బందులు, అనేక పార్టీలతో పొత్తులు.. ఇలా రాజకీయ ప్రయాణంలో నిత్యం ఆసక్తికర మలుపులతో సాగిన ఆ పార్టీ.. చరిత్రలో ఎన్నడు లేని విధంగా ఇబ్బంది పడుతోంది.

Also Read : అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. జగన్ డబుల్ గేమ్..!

కవిత దెబ్బకు కుదేలు అవుతోన్న పునాదులను.. మళ్ళీ బలోపేతం చేసేందుకు కేసీఆర్ బయటకు వచ్చారనే భావన ఇప్పుడు వినపడుతోంటే, ఇక తాము కోల్పోయిన పట్టును మళ్ళీ తిరిగి పొందేందుకు కేసీఆర్ అండ్ కో.. యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టినట్టే కనపడుతోంది. అయితే ఇప్పుడు సంచలన నిర్ణయం దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్టే కనపడుతోంది. పార్టీ పేరు మార్చాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తన సామర్ధ్యం కంటే శాస్త్రాలను, జాతకాలను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కేసీఆర్.

Also Read : కేంద్రం కంటే ముందు ఆంధ్ర..!

సెంటిమెంట్ లకు భయపడే మాజీ సిఎం సాబ్.. ఇప్పుడు బీఆర్ఎస్ అనే పేరు కలిసి రాలేదనే భావనలో ఉన్నట్టు తెలంగాణా రాజకీయ వర్గాలు అంటున్నాయి. భారత రాష్ట్ర సమితితో జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయాలని భావించి అడుగులు వేసిన కేసీఆర్ కు ఊహించని దెబ్బ తగిలింది. పేరు మార్చిన తర్వాత ఆ పార్టీ క్రమంగా ఇబ్బంది పడిన మాట వాస్తవం. అధికారం కోల్పోవడమే కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేక ఇబ్బంది పడింది. ఆ తర్వాత కుటుంబంలో సమస్యలు కూడా పార్టీని ఇబ్బంది పెట్టాయి. అందుకే ఇప్పుడు పేరు మార్చాలని, పార్టీని మళ్ళీ గాడిలో పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

పోల్స్