Wednesday, February 4, 2026 05:51 PM
Wednesday, February 4, 2026 05:51 PM

బ్రేకింగ్: భారత్ వర్సెస్ పాక్.. టెస్ట్ పోరుకు రంగం సిద్దం..?

భారత్ వర్సెస్ పాకిస్తాన్ టెస్ట్ లకు రంగం సిద్ధం అయిందా..? అంటే అవుననే అంటున్నాయి అంతర్జాతీయ క్రికెట్ వర్గాలు. ఎప్పుడో 2008 కి ముందు ప్రత్యర్దులుగా టెస్ట్ క్రికెట్ ఆడిన దాయాదులు.. ఆ తర్వాత రెడ్ బాల్ క్రికెట్ లో మాత్రం కలిసి కనపడలేదు. ఓ యాషెస్, మరో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, ఇంకో టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీ మాదిరిగా అత్యంత వినోదాన్ని పంచే ఈ రెండు దేశాల మధ్య టెస్ట్ సీరీస్ కోసం క్రికెట్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూనే ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు ముందు అడుగు పడలేదు.

Also Read : విమానయాన శాఖలో లోపం ఎవరిది?

ఈ రెండు దేశాల మధ్య జరిగిన గత టెస్ట్ మ్యాచ్ లకు సంబంధించి ఏ వీడియో వచ్చినా చూసే ఫ్యాన్స్.. లైవ్ మ్యాచ్ ల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. అప్పటి ముంబై దాడుల తర్వాత.. ఐసీసీ వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి వేదికల్లో మాత్రమే తలపడుతున్న సరిహద్దు దేశాలు.. ఇప్పుడు టెస్ట్ క్రికెట్ ఆడే సూచనలు కనపడుతున్నాయి. ఆసియా టెస్ట్ ఛాంపియన్ షిప్ కు అడుగులు వేస్తున్న ఐసీసీ.. దీనిపై వర్కౌట్ మొదలుపెట్టింది.

Also Read : టీటీడీని వేధిస్తున్న మరో సమస్య..!

రెండు దేశాల మధ్య సీరీస్ నిర్వహించే పరిస్థితి లేకపోవడంతోనే ఆసియా కప్ మాదిరిగా ఈ టెస్ట్ టోర్నమెంట్ ప్లాన్ చేస్తోంది. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య టెస్ట్ ఛాంపియన్ షిప్ నిర్వహించే విధంగా అడుగులు వేస్తోంది. టెస్ట్ క్రికెట్ ను బ్రతికించే యోచనలో ఉన్న ఐసీసీ.. భారత్ వర్సెస్ పాక్ మధ్య టెస్ట్ వార్ జరిగితే ఖచ్చితంగా అది ప్లస్ అవుతుందని అంచనా వేస్తోంది. టెస్ట్ క్రికెట్ ను బ్రతికించే విషయంలో.. భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా కీలక నిర్ణయాలు తీసుకోవాలనే మాజీల అభ్యర్ధన మేరకు ఈ అడుగులు వేస్తోంది ఐసీసీ. ఈ వార్త బయటకు రావడంతో క్రికెట్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

పోల్స్