Sunday, March 22, 2026 04:07 AM
Sunday, March 22, 2026 04:07 AM

పార్లమెంట్ ను కుదిపేసిన ఈ సిగరెట్..!

ఈ సిగరెట్ ల విషయంలో దేశ వ్యాప్తంగా నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో విమానాశ్రయాల్లో కఠిన నిబంధనలను అమలు చేస్తూ ఉంటారు. ఎవరైనా యూరప్ లేదా అమెరికా దేశాల నుంచి భారత్ కు వస్తుంటే.. కస్టమ్స్ చెకింగ్ పూర్తి స్థాయిలో ఉంటుంది. అలాంటిది పార్లమెంట్ లో ఎంపీలు కొందరు ఈ సిగరెట్ లు తాగుతున్నారనే ఓ విమర్శ పార్లమెంట్ ను కుదిపేసింది. భారతీయ జనతా పార్టీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ గురువారం లోక్‌సభలో సంచలన ఆరోపణలు చేశారు. బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్‌ ఎంపీలు ఈ సిగరెట్ లు తాగుతున్నారని అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు.

Also Read : అమరావతిలో వర్చువల్‌ స్టూడియోలు…. మల్టీ మీడియాలో లక్షన్నర జాబ్స్..!!

ప్రశ్నోత్తరాల సమయంలో ఠాకూర్ ఈ ఆరోపణలు చేస్తూ, వీటిని సభలో అనుమతిస్తారా అని స్పీకర్ ఓం బిర్లాను అడిగారు. దీనిపై స్పందించిన ఓం బిర్లా.. అనుమతి లేదని వ్యాఖ్యానించారు. దీనిపై మళ్ళీ మాట్లాడిన అనురాగ్ ఠాకూర్.. ఎంపీ పేరు చెప్పకుండా.. సభలో గత కొన్ని రోజులుగా ఓ ఎంపీ ఈ సిగరెట్ లు తాగుతున్నారని సంచలన కామెంట్ చేశారు. దేశవ్యాప్తంగా ఈ-సిగరెట్లు నిషేధించారు అని.. అయినప్పటికీ మీరు వాటిని సభలోకి అనుమతించారా? తృణమూల్ ఎంపీలు చాలా రోజులుగా సభలోనే కూర్చుని వాటిని కాలుస్తున్నారన్నారు.

Also Read : రోకో డామినేషన్.. గంభీర్ కు మరో షాక్..!

గౌరవమైన సభలో ఈ-సిగరెట్లు కాలుస్తున్నారు, దయచేసి దీనిపై వెంటనే దర్యాప్తు చేయండని కోరారు. దీనిపై స్పందించిన ఓం బిర్లా.. సభలో ఉన్న సభ్యులు సభ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. మనం పార్లమెంటరీ సంప్రదాయాలు, నియమాలకు కట్టుబడి ఉండాలి. అలాంటి విషయాలు నా దృష్టికి వస్తే, నేను చర్య తీసుకుంటానని వ్యాఖ్యానించారు. 2019 నాటికి ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం ప్రకారం వీటిని దేశంలో పూర్తిగా నిషేధించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం వీటిని తయారు చేయడం, దిగుమతి చేసుకోవడం, విక్రయించడం, పంపిణీ చేయడం, నిల్వ చేయడం లేదా ప్రకటనలు చేయడం చట్టవిరుద్ధం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్