టీం ఇండియా స్టార్ ఆటగాళ్ళు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విషయంలో నెలకొన్న అనేక అనుమానాల నేపధ్యంలో ఇటీవలి కాలంలో పడుతోన్న అడుగులు ఆసక్తిని రేపుతున్నాయి. వీళ్ళిద్దరి విషయంలో రాజకీయాలు జరుగుతున్నాయనే ప్రచారం తరుణంలో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాలతో జరిగిన వన్డే మ్యాచుల్లో ఈ ఇద్దరూ ఆడిన తీరుపై విమర్శకులు సైతం ప్రశంశలు కురిపించారు. ఈ తరుణంలో మరో వార్త ఇంట్రస్టింగ్ గా మారింది. డొమెస్టిక్ క్రికెట్ లో ఆడేందుకు ఇద్దరూ సిద్దమయ్యారు.
Also Read : మళ్ళీ యాక్టివ్ అవుతోన్న అన్నలు..?
డొమెస్టిక్ క్రికెట్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడేందుకు సిద్దమయ్యారు. కొన్ని వారాల క్రితం రోహిత్ ఈ టోర్నమెంట్‌కు అందుబాటులో ఉన్నాడని ధృవీకరించినప్పటికీ, ఇంకా క్లారిటీ రాలేదు. కానీ తాజాగా రోహిత్ క్లారిటీ ఇచ్చేసినట్టు జాతీయ మీడియా వెల్లడించింది. ఇక తన అద్భుతమైన ఫామ్ ను చెక్కుచెదరకుండా ఉంచుకోవాలని చూస్తున్నందున కోహ్లీ కూడా ఆడేందుకు సిద్దమయ్యాడని వార్తలు వచ్చాయి.
Also Read : వైసీపీలో ముసలం.. ఎమ్మెల్యే తిరుగుబావుటా
అయితే ఈ వ్యవహారంలో కీలక మలుపు తిరిగింది. బీసీసిఐ ఈ విషయంలో జోక్యం చేసుకుని.. వారిని విజయ్ హజారే ట్రోఫీ ఆడాలని బలవంతం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కోహ్లీ, రోహిత్‌లను విజయ్ హజారే ట్రోఫీ ఆడమని బోర్డు ఆదేశించలేదని, అది పూర్తిగా వారి స్వంత నిర్ణయం అని బీసీసీఐ అధికారి ఒకరు జాతీయ మీడియాకు తెలిపారు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ అయినా , హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అయినా , ఇద్దరూ ఆటగాళ్లు తమకు విశ్రాంతి దొరికినప్పుడల్లా డొమెస్టిక్ క్రికెట్ లోకి తిరిగి రావాలని ఒత్తిడి చేస్తున్నారని వార్తలు వచ్చిన నేపధ్యంలో.. బోర్డు ఈ విధంగా రియాక్ట్ అయింది. ఆ ఇద్దరూ ప్రపంచ స్థాయి ఆటగాళ్ళు, డ్రెస్సింగ్ రూమ్‌లో వారి అనుభవం చాలా ముఖ్యం. వారు చాన్నాళ్ళుగా కీలకంగా వ్యవహరిస్తున్నారు. 50 ఓవర్ల ఫార్మాట్ లో వారి అనుభవం ముఖ్యమని బోర్డు పేర్కొంది.

