భారత క్రికెట్ లో కీలక మార్పుల దిశగా అడుగులు పడుతున్నాయనే మాట వాస్తవం. ఏం జరగబోతోంది అనే అంశంలో ఇప్పటి వరకు స్పష్టత లేకపోయినా.. సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు మాత్రం ఆసక్తిని రేపుతున్నాయి. ముఖ్యంగా కోచింగ్ స్టాఫ్ విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. హెడ్ కోచ్ గౌతం గంభీర్ ను మార్చాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వినపడుతోంది. అటు సీనియర్ ఆటగాళ్ళు కూడా గంభీర్ విషయంలో సానుకూలంగా లేకపోవడంతో మార్చాలనే వస్తోంది.
Also Read : పట్టు వీడని మావోలు.. ఎందుకంత ధైర్యం..?
ఈ నేపధ్యంలో రెండు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఒకటి హెడ్ కోచ్ గా రవి శాస్త్రి, రెండు రోహిత్ శర్మ టి20 రిటర్న్స్. కోచ్ గా గంభీర్ ను ఫెయిల్ కావడంతో, రవి శాస్త్రిని తీసుకురావాలని.. కనీసం టెస్ట్ క్రికెట్ కు అతన్ని కోచ్ గా నియమించాలని బోర్డు భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2029 వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ వరకు అతనికి అవకాశం ఇస్తే మంచిదని బోర్డు భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై ఇప్పటి రవి శాస్త్రితో బోర్డు పెద్దలు సంప్రదింపులు జరిపినట్లు గా ప్రచారం జరుగుతోంది.
Also Read : జగన్ మాస్టర్ ప్లాన్.. మామూలుగా లేదుగా..!
అయితే అతను ఇప్పటికే రెండు కండీషన్ లను బోర్డు పెద్దల ముందు ఉంచినట్లు క్రికెట్ వర్గాలు అంటున్నాయి. కెప్టెన్సీ మార్పు ఒకటి, ఇతర కోచింగ్ స్టాఫ్ విషయంలో మార్పులు అడిగినట్లు తెలుస్తోంది. ఇక రోహిత్ విషయానికి వస్తే.. వచ్చే టి20 వరల్డ్ కప్ కు రోహిత్ ను కెప్టెన్ ను చేయాలనే ఆలోచనలో బోర్డు ఉన్నట్లు ప్రచారం మొదలైంది. దీనిపై ఇప్పటికే రోహిత్ కూడా అంగీకారం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. జట్టు విషయంలో గంభీర్ ఆధిపత్యం పెరిగిందనే విమర్శల నేపధ్యంలో.. బోర్డు పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఈ నిర్ణయం దిశగా అడుగులు వేసినట్టు ప్రచారం జరుగుతోంది.

