Friday, March 20, 2026 07:35 PM
Friday, March 20, 2026 07:35 PM

పాక్ బోర్డుపై బంగ్లాదేశ్ రివేంజ్ ప్లాన్..?

తమను టి20 ప్రపంచ కప్ ఆడకుండా రెచ్చగొట్టిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు షాక్ ఇచ్చే అవకాశం ఉందా..? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. పాకిస్థాన్‌లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, తమ దేశ ఆటగాళ్లను పాకిస్థాన్ సూపర్ లీగ్ తాజా సీజన్‌ లో ఆడే అంశంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్ల భద్రతే తమకు ప్రాధాన్యమని చెబుతూ, వారి ప్రయాణంపై తుది నిర్ణయాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వానికే వదిలేసింది. దీనితో బంగ్లా బోర్డు అనుమతి ఇస్తుందా లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది.

Also Read : ఇండక్షన్ టూ ఎల్పీజీ.. వంట చేసుకోవడానికి ఏది బెస్ట్..?

సాధారణంగా ఫ్రాంచైజీ లీగుల్లో ఆడేందుకు ఆటగాళ్లకు బోర్డు నేరుగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తుంది. అయితే, ప్రస్తుతం పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పెరుగుతున్న యుద్ద పరిస్థితుల కారణంగా.. పరిస్థితి సాధారణంగా లేదని బంగ్లా బోర్డు భావిస్తోంది. అందుకే, ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఆటగాళ్లు పాకిస్థాన్‌ కు వెళ్తారని బోర్డు స్పష్టం చేసింది. దీనితో ఆరుగురు కీలక ఆటగాళ్ళు ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ముస్తాఫిజుర్ రెహమాన్, పర్వేజ్ హుస్సేన్ ఎమన్ లు లాహోర్ ఖలందర్స్ జట్టుకు ఎంపిక కాగా, షోరిఫుల్ ఇస్లాం, నహీద్ రానా, తంజిద్ హసన్ తమీమ్, రిషాద్ హుస్సేన్ లు పెషావర్ జల్మీ జట్టు తరపున ఆడాల్సి ఉంది.

Also Read : చిరంజీవి ‘భజన’పై తీవ్ర విమర్శలు..!

వీరికి గతంలోనే బోర్డు ఎన్ ఓ సి మంజూరు చేసినప్పటికీ, తాజా భద్రతా కారణాల దృష్ట్యా వాటిని ప్రభుత్వం పునఃసమీక్షిస్తోంది. మరోవైపు, పీఎస్ఎల్ షెడ్యూల్ ప్రకారం మార్చి 26 నుండి ప్రారంభమవుతుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. విదేశీ ఆటగాళ్లకు దేశాధినేతలతో సమానమైన భద్రతను కల్పిస్తామని, టోర్నీ వాయిదా వేసే ప్రసక్తే లేదని పాక్ బోర్డు ప్రకటించింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒకవేళ భద్రత సరిగ్గా లేదని భావిస్తే, ఈ ఆరుగురు ఆటగాళ్లు లీగ్ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే టి20 ప్రపంచకప్ నుంచి బంగ్లా బోర్డు వైదొలగడంపై ఆ దేశ నూతన ప్రభుత్వం ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

ఆస్తుల నిజం జగన్...

గత నాలుగేళ్ల నుంచి వైఎస్ కుటుంబంలో...

మదనపల్లె దహనం కేసులో...

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన...

తగ్గని పిన్నెల్లి వాయిస్.....

పల్నాడు రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదమైన గుండ్లపాడు...

ఆళ్ల ప్లాన్ రివర్స్.....

అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో గత...

పోల్స్