Sunday, March 22, 2026 11:37 AM
Sunday, March 22, 2026 11:37 AM

అఖండ 2.. సర్జికల్ స్ట్రైక్ ..!

కష్టం వస్తే దేవుడొస్తాడని నమ్మే జనానికి.. అంటూ మొదలైన అఖండ 2 ట్రైలర్.. నందమూరి బాలకృష్ణ అభిమానులకే కాదు.. సినీ ప్రేక్షకులకే మతి పోగొట్టింది. నందమూరి బాలకృష్ణ డబుల్ రోల్‌లో వస్తున్న సినిమా అఖండ 2. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మించిన సినిమా అఖండ 2. దీనికి బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. 2021 డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ సినిమాకు ఇది సీక్వెల్. Both Are Not Same అంటూ అఖండలో బాలకృష్ణ చెప్పిన డైలాగ్‌ ఇప్పటికీ ఆయన అభిమానులకే కాదు.. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ గుర్తే. అఖండ రేంజ్‌ దాటేలా సీక్వెల్ ఉంటుందని బోయపాటి తొలి రోజే చెప్పారు. అఖండలో ఉన్న డైలాగ్‌ మాదిరిగానే అఖండ 2 కథ మొదటి భాగానికి పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది.

Also Read : అక్రమ కేసులు, అక్రమాస్తుల కేసులు ఒక్కటి కాదు

బాలకృష్ణ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న అఖండ 2 ట్రైలర్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కర్ణాటకలోని చిక్కబళ్లాపురలో నిర్వహించిన ఈవెంట్‌లో ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లాక్‌డౌన్ తర్వాత రిలీజ్ అయిన తొలి భారతీయ చిత్రం అఖండ. కరోనా కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు భయపడుతున్న సమయంలో.. అఖండ గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమాతో థియోటర్లు మళ్లీ కళకళలాడుతున్నాయి. తొలి సినిమా పూర్తిగా మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా తీశారు. ప్రకృతి జోలికి, పిల్లల జోలికి వస్తే భగవంతుడు మనిషిలో ఆవహిస్తాడనేది అఖండ సినిమా కథ. ఈ సినిమాలో సహ విలన్‌గా శ్రీకాంత్ నటించారు. ఓ బైరాగిగా జగపతిబాబు నటించారు. ఇది అప్పట్లో ఇండస్ట్రీ హిట్. అఖండ సీక్వెల్ అని ప్రకటించగానే.. అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

Also Read : బ్రేకింగ్: మోగనున్న స్థానిక ఎన్నికల నగారా..?

సనాతన హైందవ ధర్మం ప్రధానాంశంగా అఖండ 2 ఉన్నట్లు ట్రైలర్‌లో స్పష్టమవుతోంది. తొలి భాగాన్ని పూర్తిగా రాష్ట్రానికే పరిమితం చేసిన దర్శకుడు బోయపాటి.. రెండో భాగాన్ని మాత్రం అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. సర్జికల్ స్ట్రైక్ అంటూ అఘోర బాలకృష్ణ చెప్పిన డైలాగ్.. పాకిస్తాన్ సైన్యంతో బాలకృష్ణ ఫైటింగ్.. ప్రతినాయకుడిగా ఆది పినిశెట్టి.. సినిమాపైన మరింత హైప్ పెంచాయి. మహా కుంభమేళ ప్రధానాంశంగా కనిపిస్తోంది. ఇక బోయపాటి అంటే ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉంటుంది. అఖండ 2లో గ్రాఫిక్ వర్క్, సౌండ్ ఎఫెక్ట్ చూసిన తర్వాత.. థియేటర్‌లో ఎలా ఉంటుందో అని బాలయ్య అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. డిసెంబర్ 5వ తేదీన అఖండ తాండవమే అని సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. మొత్తానికి అఖండ 2లో బాలయ్య చెప్పినట్లుగా ఒకసారి లేచి శబ్దం చేస్తే.. ప్రపంచమే నిశ్శబ్దం అవుతుందేమో చూడాలంటే.. డిసెంబర్ 5 వరకు ఆగాల్సిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్