Wednesday, March 25, 2026 09:29 AM
Wednesday, March 25, 2026 09:29 AM

రెండు పాత్రల్లో నట సింహం గర్జన..? బాలయ్యను వాడేస్తున్న డైరెక్టర్..!

డైరెక్టర్ కు తగ్గట్టుగా పని చేసే హీరో.. నందమూరి నట సింహం బాలకృష్ణ. బాలయ్యతో సినిమా చేసిన డైరెక్టర్ లు అందరూ దాదాపుగా చెప్పే మాట ఇదే. సినిమా సక్సెస్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా డైరెక్టర్ ఏం చెప్తే అది చేసే బాలయ్య.. ప్రస్తుతం మలినేని గోపిచంద్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఇటీవల దాదాపుగా ఖరారు అయిందనే వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా సినిమాకు బాలయ్య రేంజ్ పెరుగుతూ పోతోంది. అఖండ సీక్వెల్ తో నార్త్ ఇండియాలో బాలయ్య కొంత ఫేమస్ అయ్యారు.

Also Read : కుల చిచ్చు కోసం కొత్త డ్రామా..?

పార్ట్ 1 కంటే పార్ట్ 2 కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక గోపిచంద్ డైరెక్షన్ లో బాలయ్య ఇప్పటికే ఓ సినిమా చేసారు. ఆ సినిమాలో రెండు పాత్రలతో బాలయ్య ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో కూడా బాలయ్య అదే స్థాయిలో రెండు పాత్రలు చేసే ఛాన్స్ కనపడుతోంది. అయితే ఒక పాత్ర కాస్త నెగటివ్ గా ఉండే ఛాన్స్ ఉందని టాక్. రెండు పాత్రలకు వెయిట్ తగ్గకుండా ఉండేలా డైరెక్టర్ ప్లాన్ చేయగా.. బాలయ్య ఓకే చెప్పేశారు. సినిమాను దసరా నాటికి రిలీజ్ చేసే ప్లాన్ కనపడుతోంది.

Also Read : నమ్మకం లేదు.. కానీ అదే నిజం.. ఇదే లాజిక్కు..!

ఇక విలన్ పాత్రకు వివేక్ ఒబెరాయ్ లేదా బాలీవుడ్ హీరో అక్షయ్ ఖన్నా పేరుని పరిశీలిస్తున్నాడు డైరెక్టర్. ఇదే టైం లో జాట్ అనే సినిమాతో.. సన్నీ డియోల్ కు హిట్ ఇచ్చిన గోపిచంద్.. ఆ హీరోను కూడా ఈ సినిమాతో తెలుగులో పరిచయం చేసే ప్లాన్ చేస్తున్నాడు. ఏది ఎలా ఉన్నా రెండు పాత్రల్లో బాలయ్య కనపడతారు అనే వార్త కాస్త హాట్ టాపిక్ అయింది. అఖండలో కూడా బాలయ్య రెండు పాత్రల్లో నటించారు. అందులో అఘోరా పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కిమిడి సోదరుల మధ్య...

తెలుగు రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న...

బ్రేకింగ్: డేంజర్ జోన్...

ఏపీలోని బెజవాడ నగరం వేదికగా సాగుతున్న...

బ్రేకింగ్: మాట నిలబెట్టుకున్న...

గత కొన్ని రోజులుగా విమర్శలు ఎదుర్కొంటున్న.....

ఏపీపై రైల్వే శాఖ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి...

బాబోయ్.. బెజవాడలో ఉగ్రవాదులు..!

విజయవాడ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విజయవాడలో...

బ్రేకింగ్: ఐటీ రంగంపై...

అమెరికా, ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం...

పోల్స్