Saturday, March 21, 2026 11:44 PM
Saturday, March 21, 2026 11:44 PM

గుడ్ న్యూస్: బులెట్ ట్రైన్ రెడీ.. 500 కి.మీ దూరానికి టైం ఎంతంటే..?

దేశంలో రైల్వే వ్యవస్థ బలోపేతం విషయంలో కేంద్రం పట్టుదలగా అడుగులు వేస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున వినియోగిస్తూ.. నూతన రైల్వే సేవలను తీసుకొస్తుంది. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ విషయంలో కేంద్ర రైల్వే శాఖ కీలక అడుగులు వేసింది. తాజాగా దీనిపై కేంద్ర రైల్వే శాఖా మంత్రి కీలక ప్రకటన చేసారు. భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు ఆగస్టు 2027 లో ప్రారంభం కానుందని తెలిపారు. గుజరాత్‌ లోని సూరత్ మరియు వాపి మధ్య 100 కి.మీ దూరాన్ని కవర్ చేస్తుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జాతీయ మీడియాతో వ్యాఖ్యానించారు.

Also Read : భాగ్యశ్రీ తో ఎఫైర్ పై రామ్ క్లారిటీ..!

దాని కంటే ముందు సూరత్ – బిల్లిమోర్ మధ్య 50 కి.మీ.ల దూరానికి ట్రైన్ ప్రారంభిస్తామని తెలిపారు. భారతదేశంలో మొట్టమొదటి 508 కి.మీ. పొడవైన హై-స్పీడ్ రైలు కారిడార్ సబర్మతి (అహ్మదాబాద్) – ముంబై మధ్య నిర్మిస్తున్నారు. గంటకు 320 కి.మీ. వేగంతో బుల్లెట్ రైలు ప్రయాణించి, మొత్తం దూరాన్ని 2 గంటల 17 నిమిషాల్లో చేరుకుంటుంది. 2017లో శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. మొత్తం ప్రాజెక్టును డిసెంబర్ 2023 నాటికి సిద్ధం చేయాలని మొదట ప్రతిపాదించారు.

Also Read : బీజేపి చీఫ్ ఆయనే..? కేంద్ర మంత్రి వర్గంలో కీలక మార్పులు..!

అయితే, భూసేకరణ – ఇతర సమస్యలు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఆలస్యం చేశాయి. బుల్లెట్ రైలు ముంబై – అహ్మదాబాద్ మధ్య దూరాన్ని 1 గంట 58 నిమిషాల్లో చేరుకుంటుందని.. నాలుగు స్టేషన్లలో ఆగుతుందని తెలిపారు. ఇది మొత్తం 12 స్టేషన్లలో ఆగితే, మొత్తం దూరం 2 గంటల 17 నిమిషాల్లో చేరుకుంటుందని వైష్ణవ్ ప్రకటించారు. మొత్తం ప్రాజెక్ట్ 2029 చివరి నాటికి పూర్తి చేస్తామని, కారిడార్‌ లో సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ సీమెన్స్ నేతృత్వంలోని కన్సార్టియంకు కాంట్రాక్టును అప్పగించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్