రాజకీయాల్లో మీడియా పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. రాజకీయాల్లో మాట్లాడిన మాటలు, మాట్లాడని మాటలు కూడా ఊహలు, కల్పితాలతో రాసేదే, చూపించేదే నేటి మీడియా అనేది ఎన్నో సందర్భాల్లో రుజువు అయింది. అలాగే ఒకరిని కాపాడటం కోసం మరొకరిని బలి చేయడం కూడా మీడియా స్టైల్ గా మారిపోయింది. ఇండిగో వ్యవహారంలో రిపబ్లిక్ టీవీ అధినేత అర్నబ్ గోస్వామి అనుసరించిన వైఖరే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఓ ప్రైవేట్ సంస్థ లోపాలను తెలివిగా రాజకీయాలకు వేదికగా మార్చారు అర్నబ్ అనేది ఆరోపణ.
Also Read : అర్నాబ్.. ఈ ప్రశ్నలకు జవాబు ఉందా..?
ఇండిగో వ్యవహారం కేంద్రానికి సంబంధించినది. విమానయాన సంస్థ కాబట్టి.. సంబంధిత శాఖ స్పందించాలి. ఈ వ్యవహారంలో రాజకీయ నాయకులకు సంబంధం లేదు. డిబేట్ లు నిర్వహిస్తే మాజీ ఉద్యోగులను, నిపుణులను పిలవాల్సి ఉంటుంది. కానీ.. అర్నబ్ మాత్రం తెలివిగా టీడీపీ నేతలను ఆహ్వానించారు. టీడీపీ నేతలు కూడా వెనుకా ముందు చూడకుండా వెళ్ళిపోయారు. ఏది పడితే అది మాట్లాడి.. టీడీపీ అధిష్టానాన్ని తిట్టించారు అనేది స్పష్టంగా అర్ధమైంది. ఇక్కడ కేంద్రాన్ని టార్గెట్ చేయకుండా తెలివిగా టీడీపీ వర్సెస్ ఇండిగోగా వ్యవహారాన్ని మార్చారనేది వినపడుతోంది.
రామ్మోహన్ నాయుడును పదే పదే టార్గెట్ చేసే ప్రయత్నం చేసారు. ఇండిగో సంస్థ దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ. 60 శాతం విమానాలను నడుపుతోంది. రామ్మోహన్ నాయుడు వచ్చిన తర్వాత ఆ విమానాలను కొనుగోలు చేసి నడపలేదు. దశాబ్ద కాలంగా మారుమూల ప్రాంతాలకు విమానాలను నడిపింది. రామ్మోహన్ నాయుడు వచ్చిన తర్వాత కఠిన నిర్ణయాలు తీసుకుంది విమానయన శాఖ. ఆ తర్వాతనే ఇండిగో లోపాలు బయట పడ్డాయి. గత 5 ఏళ్ళుగా ఇండిగో నిబంధనలను ఉల్లంఘిస్తునే ఉంది.
Also Read : లోకేష్ పేరు వాడితే అంతే.. టీడీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్..?
కాస్ట్ కటింగ్ పేరుతో పైలెట్ లను తగ్గించింది. ఎఫ్.డి.టి.ఎల్ నిబంధనలు వచ్చిన తర్వాత, వాటిని దేశ వ్యాప్తంగా అమలు చేసిన తర్వాత పైలెట్ ల కొరత బహిరంగం అయింది. చలికాలంలో వాతావరణ మార్పులతో విమానాలు రద్దు అవుతాయనుకుంది గానీ.. సి 3 రన్ వే వ్యవస్థను తక్కువ అంచనా వేసింది. ఆ దెబ్బకే విమానాలు పెద్ద ఎత్తున రద్దు అయ్యాయి. ఈ విషయాలను వదిలేసి.. ఓ రామ్మోహన్ నాయుడును తెలివిగా టార్గెట్ చేసి.. తప్పు కేంద్రానిది కాదు టీడీపీ మంత్రిది అన్నట్టు మార్చారు అర్నబ్. ఓడిస్సా రైలు ప్రమాదం సమయంలో గానీ.. ఇతర ప్రమాదాల సమయంలో గానీ బీజేపి మంత్రులను అర్నబ్ డిబేట్ లకు పిలవకపోవడం గమనార్హం.

