Sunday, March 22, 2026 12:56 PM
Sunday, March 22, 2026 12:56 PM

ముంబై హీరోయిన్ కేసులో అడ్డంగా దొరికిపోయిన పోలీసులు

ముంబై నటి కేసులో పోలీసులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. పోలీస్ అధికారుల పై చర్యలు సిఫార్సు చేసారు. అలాగే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పై కేసు నమోదుకు సూచనలు చేసారు. ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం ఠాణాలో విద్యాసాగర్ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు పెట్టారని విచారణలో వెల్లడి అయింది. ఆమె అరెస్టు వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు కాంతిరాణా తనకు అనుకూలమైన అధికారులను నియమించుకున్నారు. ముంబయికి వెళ్లడం, అక్కడ కాదంబరితో పాటు ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి విజయవాడకు తరలించడం, రిమాండ్కు పంపడం వరకూ కాంతిరాణా, విశాల్ గున్ని నేరుగా పర్యవేక్షించారని విచారణలో గుర్తించారు.

జత్వానీ పేరిట ముంబయిలో స్టాంపు పేపర్ కొనుగోలు చేసి, 2018లో రాసినట్లు సృష్టించారని ఇందులో వైకాపాకు చెందిన ఓ న్యాయవాది కీలకంగా వ్యవహరించినట్లు తెలిపారు. ముందస్తు ప్రణాళికలో భాగంగా ముంబయికి విమాన టిక్కెట్లు బుక్ చేసుకుని, పోలీసులు దొరికిపోయారు. వైకాపా నేత కుక్కల విద్యాసాగర్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిబ్రవరి 2న ఉదయం 6.30కి ఫిర్యాదు చేసారు. అదేరోజు 11.30కి విమానంలో డీసీపీ విశాల్ గున్ని, అదనపు డీసీపీ రమణమూర్తి తదితరులతో కూడిన బృందం ముంబయికి వెళ్లింది.

Read Also : తెలంగాణాలో రెండు రోజులు వైన్ షాప్ లు బంద్

ఈ విమాన ప్రయాణం టికెట్లు ఫిబ్రవరి 1న బుక్ చేశారని ఇందులో కుట్ర కోణం ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. సంచలనం సృష్టించిన కాదంబరీ జత్వానీపై అక్రమ కేసు, అరెస్టు వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు నివేదిక డీజీపీ ద్వారకా తిరుమలరావు ద్వారా ప్రభుత్వానికి చేరింది. ఈ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ అంతా సీతారామాంజనేయులుగా విచారణలో వెల్లడి అయింది. ముఖ్యనేత చెప్పగానే రంగంలోకి దిగిన పీఎస్ఆర్.. కాదంబరిపై ఏ కేసు పెట్టాలి, ఎలా అరెస్టు చేయాలి, ఎవరెవరిని భాగస్వాములను చేయాలో ఆయన ఒక స్కెచ్ రెడీ చేసుకున్నారు.

పీఎస్ఆర్ తో పాటు కాంతిరాణా, విశాల్ గున్ని, స్థానిక దర్యాప్తు అధికారి వరకూ అందరిపైనా ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కుట్రలో పాత్రధారులైన కొందరు పోలీసులు తమకు చిక్కులు తప్పవని భావించి, అప్రూవర్లుగా మారి విచారణ అధికారికి పూర్తిగా సహరించారట. నాడు ఉన్నతాధికారుల ఆదేశానుసారమే తాము నడుచుకున్నామని దర్యాప్తు అధికారి స్రవంతిరాయ్ ముందు పోలీసులు స్పష్టం చేసారు. తప్పుడు కేసులో తనతో పాటు తన తల్లిదండ్రులను జైలుపాలు చేసి వేధించిన ఉదంతంలో ఐపీఎస్ లు సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్ని కీలక వ్యక్తులు అని కాదంబరి జత్వానీ ఇటీవల దర్యాప్తు అధికారి స్రవంతి రాయ్ కి ఫిర్యాదు చేసారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్