Wednesday, February 4, 2026 09:38 PM
Wednesday, February 4, 2026 09:38 PM

సజ్జలపై పవన్ గురి.. అడ్డంగా దొరికాడా..?

వైసీపీ నేత, మాజీ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇన్నాళ్ళు తప్పించుకుని తిరిగిన సజ్జల రామకృష్ణారెడ్డి సొంత జిల్లాలో చేసిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ వేగవంతం చేసింది. కడప జిల్లాలో 52 ఎకరాల చుక్కల భూములు ప్రభుత్వ భూములు సజ్జల కుటుంబీకులు కబ్జా చేశారని ఆరోపణలు గత కొన్నాళ్ళుగా వస్తున్నాయి. కడప జిల్లా నేతలు పదే పదే దీనిపై ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇక మీడియాలో కూడా సజ్జల కుటుంబం కబ్జాలపై ఎన్నో వార్తలు వచ్చాయి.

Also Read : ఉద్యోగాల జాతర.. ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలు

అయితే ఇప్పటి వరకు వాటిపై ముందడుగు పడలేదు. కానీ ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిపై దృష్టి సారించారు. పేదల, ప్రభుత్వ భూములు జోలికి ఎవరు వచ్చినా సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు పవన్ కళ్యాణ్. ఈ మేరకు విచారణకు ఆదేశించిన ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం చేసిన కబ్జాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని అటవీ రెవెన్యూ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో సంబంధిత అధికారులు ఇప్పుడు విచారణ కోసం రంగంలోకి దిగారు.

Also Read : ఎస్పీని వేధిస్తున్నారా..? రేవంత్ సర్కార్ పై సుప్రీం కోర్ట్ సంచలన వ్యాఖ్యలు…?

అయితే తానే తప్పు చేయలేదని ఎటువంటి భూములను తాను ఆక్రమించలేదని సజ్జల చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై చిన్న చిన్న అధికారులు కాకుండా ఉన్నత స్థాయి అధికారులతోనే విచారణ జరిపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. చిన్నచిన్న అధికారులను కడప జిల్లాలో బెదిరిస్తున్నారు అని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. స్వయంగా పవన్ కళ్యాణ్ నివేదిక అడగటంతో అధికారులు పరుగులు పెడుతున్నారు. ఇక కబ్జా చేసిన భూముల్లో పండ్ల తోటలు అలాగే గెస్ట్ హౌస్లు కూడా కట్టుకున్నారు. పనివాళ్ళకు రేకుల షెడ్లు అలాగే కొన్ని ఇళ్ళు కూడా నిర్మించినట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్