Monday, October 27, 2025 08:52 PM
Monday, October 27, 2025 08:52 PM
roots

వైసీపీ లో శ్యామల డామినేషన్.. మండిపడుతున్న నాయకులు

వైసీపీలో ఇప్పుడు కొంతమందికి ఆ పార్టీ అధిష్టానం ఇస్తున్న ప్రయారిటీ చూసి పార్టీ నేతలు కూడా కాస్త షాక్ అవుతున్నారు. ముఖ్యంగా యాంకర్ శ్యామల విషయంలో ఆ పార్టీ అధిష్టానం చూపిస్తున్న ఇంట్రెస్ట్ అంతా కాదు. గతంలో కష్టపడి జగన్ కోసం ఆస్తుల అమ్ముకున్న వాళ్ళ కంటే యాంకర్ శ్యామల హడావుడి ఇప్పుడు ఎక్కువగా ఉంది. ఆమెకిస్తున్న ప్రయారిటీ కూడా కాస్త ఎక్కువగానే కనబడుతుంది. వైసీపీ సోషల్ మీడియా కూడా ఆమెను ఎక్కువగానే లేపుతోంది. దీనిపై పార్టీ సీనియర్ నేతలు.. ముఖ్యంగా మహిళ నేతలు సీరియస్ గా ఉన్నారు.

Also Read : రెచ్చిపోతున్న వెంకట్రామిరెడ్డి.. బాబు సర్కార్ ని అవమానించడమేనా?

ఏ జిల్లాలో పార్టీ సమావేశం జరిగినా.. సరే స్పెషల్ ఎట్రాక్షన్ కోసం యాంకర్ శ్యామలను పార్టీ నేతలు పిలుస్తున్నారు. ఆమె ఖర్చులు అన్నీ వాళ్ళే భరిస్తూ హడావుడి చేస్తున్నారు. మొన్నామధ్య అనంతపురంలో జరిగిన కార్తీకమాస రెడ్డి వన సమారాధన కార్యక్రమానికి ఈమెను చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అటు చిత్తూరు జిల్లా నాయకులు కూడా ఆమెకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో ఏపీలోనే ఆమె ఉంటూ హడావుడి చేస్తోంది.

సీనియర్ నేతలు రోజా, విడదల రజిని సహా మరి కొంతమంది మహిళా నాయకులు ఉన్నా సరే ఈమెకిస్తున్న ప్రయారిటీ చూసి అటు వైసీపీ కార్యకర్తలు కూడా షాక్ అవుతున్నారు. ఆమె వల్ల ఒక్క ఓటు కూడా పడదని అలాంటి వ్యక్తికి ఎందుకు అంత ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుందంటూ ఫైర్ అయిపోతున్నారు. ఏకంగా ఆమెకు రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి ఇవ్వటం వెనుక కారణాలేంటి అనేది ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చ జరుగుతోంది. ఇక వైసిపి మీడియాలో ఆమె మాట్లాడిన మాటలను పదేపదే ప్రసారం చేయడం కూడా వైసిపి నేతలకు నచ్చడం లేదు.

Also Read : అసలు ఏం జరుగుతుంది.. లోకేష్‌ ఫైర్‌..!

వైసీపీ కోసం బూతులు తిట్టి.. కేసులు కూడా ఎదుర్కొన్న నాయకులకు లేని విలువ ఆమెకు ఇవ్వటం కరెక్ట్ కాదంటూ మాజీ మంత్రి విడుదల రజిని పార్టీ అధిష్టానం వద్ద స్పష్టంగా చెప్పారట. అసలు ఆమెది ఏ నియోజకవర్గం ఎవరికీ తెలియదని కేవలం సినిమా యాక్టర్ కాబట్టి ప్రజలు వింటారని సోషల్ మీడియాలో వైరల్ అవుతాయని.. ఆమెకు అంత ప్రయారిటీ ఇవ్వటం కరెక్ట్ కాదని పార్టీ అధిష్టానం వద్ద ఇప్పటికే ఆర్కే రోజా కూడా తన అసహనం వ్యక్తం చేశారట.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్