Wednesday, February 4, 2026 08:20 AM
Wednesday, February 4, 2026 08:20 AM

బూతులతో రెచ్చిపోయిన అంబటి..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే.. అది రాజకీయ పార్టీ కాదు.. బూతు పార్టీ అనే ముద్ర సరైందే అన్నట్లుగా ఆ పార్టీ నేతల తీరు. అధికారంలో ఉన్నా లేకున్నా సరే.. వైసీపీ నేతల నోటికి అడ్డూ అదుపు లేకుండా ఉంది. ఇంకా చెప్పాలంటే.. సాటి మనిషిని కనీసం గౌరవించాలనే కనీస ఇంకితజ్ఞానం కూడా లేకుండా.. ఇంకా చెప్పాలంటే కడుపుకు అన్నం తింటున్నారో.. లేక గడ్డి తింటున్నారో కూడా తెలియకుండా ఉన్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా.. కనీసం ఎక్కడ ఉన్నామనే విషయం సోయ లేకుండా.. ఏం మాట్లాడుతున్నామనేది కూడా తెలియకుండా.. నోటికి వచ్చినట్లు వాగేస్తున్నారు. అయితే ఇలా నోటికి వచ్చినట్లు వైసీపీ నేతలు వాగటానికి… ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోవడానికి అసలు కారణం.. కూటమి సర్కార్ ఇచ్చిన అలుసు.. ఇంకా చెప్పాలంటే చేతగాని తనమే అనేది వాస్తవం. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా కూడా.. తప్పు చేసిన వారి తాట తీయడానికి ఇప్పటికీ వెనకడుగు వేస్తున్న ప్రభుత్వ పెద్దలదే ముమ్మాటికీ తప్పు.

Also Read : గతం మర్చిపోయిన జగన్..!

ఏపీలో తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని సీబీఐ ఛార్జ్‌షీట్‌‌లో రుజువైంది. పాలు, పెరుగు లేకుండా కూరగాయల ప్రేరకాలు, రసాయనాలతో నెయ్యి లాంటి పదార్థం తయారు చేసి టీటీడీకి సరఫరా చేసినట్లు స్పష్టమైంది. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో సుమారు 250 కోట్ల రూపాయలతో 60 ల‌క్ష‌ల కిలోల కల్తీ నెయ్యి కొనుగోలు చేశారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆరోపించారు. నెయ్యి కొనుగోలు వ్యవహారంలో కొందరి ఖాతాల్లోకి కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో సీబీఐ విచారణ చేయాలని బీఆర్ నాయుడు డిమాండ్ చేశారు కూడా. ఈ వ్యవహారంపై సొంత పార్టీ నేతలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాతే.. ఆ పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు వేశారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఇలా ఫ్లెక్సీలు వేయడాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పట్టపగలే చింపేసి నడిరోడ్డు మీద నిప్పు పెట్టారు. దీనిపై అడ్డుకునేందుకు వచ్చిన ఎస్‌ఐ మురళీపై దాడికి కూడా యత్నించారు వైసీపీ నేతలు.

గుంటూరులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని 24 గంటల్లో తొలగించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు అల్టీమేటం జారీ చేశారు. అది తొలగించటంతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. ఫ్లెక్సీలు తొలగించకపోతే.. తానే స్వయంగా రంగంలోకి దిగి.. వాటిని తొలగిస్తా అంటూ టీడీపీ నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే అంబటి హెచ్చరికలను టీడీపీ నేతలు పట్టించుకోలేదు. దీంతో.. నా మాటంటే లెక్క లేదా మీకు అంటూ రెచ్చిపోయిన అంబటి.. మందీ మార్భలాన్ని వెంటేసుకుని గుంటూరులో అనుమతి లేకున్నా సరే.. ర్యాలీ చేసేశారు. గుంటూరులో వెంకటేశ్వర స్వామి గుడి వద్ద టీడీపీ కార్యకర్తలు కల్తీ లడ్డు బ్యానర్ కట్టిన చోటుకు వచ్చేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఉద్రిక్తతలకు దారి తీస్తుందని.. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రెచ్చిపోయిన అంబటి.. ఉచ్చనీచాలు మర్చిపోయారు. చదువుకున్న వ్యక్తి అనే విషయం మర్చిపోయారు. తన కంటే వయసులో పెద్ద.. ఉన్నతమైన స్థానంలో ఉన్నాడనే కనీస విషయం కూడా మర్చిపోయిన అంబటి.. నోటికి వచ్చిన గాలి మాటలన్నీ అనేశాడు.

Also Read : దుర్గమ్మ సన్నిధిలో రౌడీ రాజ్యం.. సెక్యూరిటీ ఏజెన్సీ దారుణాలు..!

అనుమతి లేదని పోలీసులు అడ్డుకుంటే.. పోలీసులను చంద్రబాబు పంపాడంటూ.. అంబటి రెచ్చిపోయాడు. రమ్మను నా కొ.. ని.., ఆ లం.. కొ.. ను రమ్మను.., చంద్రబాబు గా.. ని రమ్మను.., వాడమ్మ మొగుడిని రమ్మను.. అంటూ ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడారు. కారులో కూర్చున్న తర్వాత కూడా రమ్మను నా కొ.. ను అంటూ సవాల్ విసిరారు. ఆ తర్వాత పోలీస్ ఆంక్షలు లెక్క చేయకుండా ముందుకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిజానికి అంబటి నోటి దురుసు ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులపై రెచ్చిపోయారు. నువ్వెడ్రా నన్ను ఆపడానికి.. నీ బతుకెంత.. నువ్వు ఆఫ్ట్రాల్ పోలీస్.. అంటూ కించపరిచే వ్యాఖ్యలు చేశారు. జగన్ సత్తెనపల్లి పర్యటన సమయంలో కూడా కాన్వాయ్ అనుమతి లేదని పోలీసులు అడ్డుకుంటే.. మీ సంగతి తేలుస్తా.. నన్నే ఆపుతారా.. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కడి తాట తీస్తా అని వార్నింగ్ కూడా ఇచ్చాడు ఇదే అంబటి.

నిజానికి అంబటి మాత్రమే కాదు.. వైసీపీ నేతలంతా ఇదే తీరు. 2014-19 మధ్య కాలంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి రోజా నగరిలో ధర్నా చేశారు. ఓ సీఐను ఉద్దేశించి.. రమ్మను ఆ లం.. కొడు.. ను అంటూ రోజా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఇక మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అయితే అధికారంలో, పదవిలో ఉన్నప్పుడే వేదిక పై నుంచి మైక్ పట్టుకుని.. లం.. కొడు.. అంటూ రెచ్చిపోయారు. మాజీ మంత్రి సీదిరి అప్పల్రాజు కూడా పోలీసులపై దురుసుగానే ప్రవర్తించారు. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న విషయం కూడా మర్చిపోయిన సీదిరి.. ఓ సీఐతో.. రేయ్.. నా కొ.. నీ సంగతి తేలుస్తా అన్నారు. ఇన్ని జరుగుతున్నా.. వైసీపీ నేతల పై చర్యలు తీసుకునేందుకు కూటమి సర్కార్ ఎందుకు భయపడుతుందో తెలియటం లేదు. అందుకేనేమో.. మాజీ మంత్రి కొడాలి నాని.. ప్రతిసారి “నా బొచ్చు కూడా పీకలేరు” అని సవాల్ విసిరాడు. అంటే టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చర్యలు తీసుకునే పరిస్థితి లేదని నానికి ముందే తెలుసన్న మాట. అందుకే అంబటి రాంబాబు కూడా కారులో నుంచి బయటకు వచ్చి.. మీడియా మైకు ముందే నోటికి వచ్చినట్లు వాగేసి.. కారులో తుర్రున వెళ్లిపోయాడు. అంబటి బూతుల వీడియో ఉంది కదా.. మరి దీని ఆధారంగానైనా అరెస్టు చేస్తారా.. చర్యలు తీసుకుంటారా.. లేదంటే.. మనకెందుకులే.. అని ఊరుకుంటారా.. చూద్దాం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్