వంగవీటి మోహన్ రంగా అనగానే చాలా మందికి ఉండే భావన.. కాపు సామాజిక వర్గంలో బలమైన నాయకుడు. మరికొందరు కులాలకు మతాలకు సంబంధం లేకుండా పేద ప్రజల కోసం పోరాడిన నేతగా చెప్తూ ఉంటారు. కానీ కాపు సామాజిక వర్గం కాబట్టి.. కాపు నేతగానే ఆయనకు ఇమేజ్ ఉంది. అక్కడి వరకు బాగానే ఉంది గానీ.. కాపులను ఎప్పుడైతే వైసీపీ దగ్గర చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుందో అక్కడి నుంచి కూడా.. తమ పార్టీలో ఉన్న నేతలకు రంగా వారసులు అని చెప్పే ప్రయత్నం మొదలుపెట్టింది.
Also read : అప్పుడు అత్యాశ పడ్డారు.. ఇప్పుడు బోల్తా పడ్డారు..!
గతంలో ముద్రగడ పద్మనాభ రెడ్డికి ఇప్పుడు అంబటి రాంబాబుకు ఈ లింక్ లు చేసింది. సిఎం చంద్రబాబును బూతులు తిట్టడంతో అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేసారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో మొన్న రంగా, నిన్న ముద్రగడ, నేడు అంబటి అంటూ ఎలివేషన్ లు ఇవ్వడం మొదలుపెట్టారు. రాంబాబు.. వంగవీటి వారసుడు అనే విషయం మర్చిపోవద్దు అని, రంగా ప్రాణాలు తీసినట్టే రాంబాబు ప్రాణాలు కూడా తీస్తారని కామెంట్ చేయడం మొదలుపెట్టారు. రంగా.. కొడుకు, కుమార్తె బయటకు రావాలని డిమాండ్ చేసారు.
Also read : కేంద్ర బడ్జెట్ ప్రభావం: మార్కెట్లకు ముప్పేనా?
దీనిపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. రాంబాబు.. సంజన వ్యవహారం ప్రస్తావిస్తూ.. రంగా శిష్యులు అలా ఉండరని, రాంబాబు ఏ పోరాటం చేసాడని మండిపడుతున్నారు. కుల చిచ్చు కోసం ఇప్పుడు వైసీపీ మైండ్ గేమ్ ఆడుతుందని, టీడీపీ కార్యకర్తలు వారి ఉచ్చులో పడవద్దు అంటూ కొందరు కోరుతున్నారు. కుల చిచ్చు కోసం ముద్రగడను అడ్డం పెట్టి రత్నాచల్ రైలు దహనం చేసారని, ఇప్పుడు రాంబాబును అడ్డం పెట్టి విధ్వంశం చేసే దిశగా వైసీపీ అడుగులు వేస్తుంది అంటూ విమర్శలు వస్తున్నాయి. సత్తెనపల్లి ఇంచార్జ్ భార్గవ్ రెడ్డి.. రాంబాబు ఇంటికి నిప్పు పెట్టి దానిని టీడీపీ మీద నెట్టే ప్రయత్నం జరుగుతోందని మరికొందరు విమర్శలు చేస్తున్నారు.

