Sunday, March 22, 2026 12:17 PM
Sunday, March 22, 2026 12:17 PM

క్యాలెండర్ ఇయర్ లో 2 వేల కోట్లు.. స్టార్ హీరోలకు సాధ్యం కాని రికార్డ్..!

అక్షయ్ ఖన్నా” బాలీవుడ్ మోస్ట్ అన్ లక్కీయేస్ట్ యాక్టర్ ఎవరూ..? అనగానే వినపడే పేరు ఇది. మూడు దశాబ్దాలుగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నప్పటికీ.. అక్షయ్ ఖన్నాకు మాత్రం సరైన గుర్తింపు రాలేదు. ఖాన్ త్రయం మాయలో ఉన్న బాలీవుడ్ జనాలు.. అక్కడి మీడియా.. ఈ యాక్టర్ కు మాత్రం సరైన గుర్తింపు ఇవ్వలేదు. కానీ అతను మాత్రం పట్టువీడలేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలక పాత్రలు చేస్తూ దుమ్మురేపుతున్నాడు. వచ్చే ప్రతీ ఛాన్స్ ను ప్రూవ్ చేసుకుంటున్నాడు.

Also Read : ఈ ఎమ్మెల్యే గారు మారరా..? చికాకులో క్యాడర్..!

అతని కెరీర్ లో 2025 మాత్రం సూపర్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. విలన్ పాత్రలో నటించిన ఈ స్టార్ యాక్టర్ కు రెండు సినిమాలు అదిరిపోయే గుర్తింపు తెచ్చాయి. ఛావా సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన అక్షయ్ ఖన్నా.. ఆ సినిమాలో తన నటనతో, లుక్స్ తో సిల్వర్ స్క్రీన్ పై సరిగా సరిపోయాడు. ఆ సినిమా భారీ వసూళ్లు సాధించింది. ఇక ఇప్పుడు దురంధర్ సినిమాతో అక్షయ్ ఖన్నాకు మరో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. రహ్మాన్ దికాయత్ పాత్రలో ఆకట్టుకున్నాడు అక్షయ్ ఖన్నా. ఇది కూడా విలన్ పాత్రే కావడం విశేషం.

Also Read : వైయస్ భారతి పొలిటికల్ ఎంట్రీ ఫైనల్..? కీలక బాధ్యతల్లో మేడం..?

దీనితో ఒకే క్యాలెండర్ సంవత్సరంలో బాక్సాఫీస్ వద్ద 2000 కోట్ల రూపాయలు వసూలు చేసిన రెండవ భారతీయ నటుడిగా నిలిచాడు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో విక్కీ కౌశల్ హీరోగా నటించిన చావా సినిమాలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుగా అక్షయ్ తొలిసారిగా ఆకట్టుకున్నాడు. జనవరి 2025లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 809 కోట్లు వసూలు చేసి, గత ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఇప్పటివరకు, ధురంధర్ ప్రపంచవ్యాప్తంగా రూ 1167 కోట్లు వసూలు చేసింది. ఆ రెండు సినిమాలు గత ఏడాది 2001 కోట్లు వసూలు చేసాయి. దీనితో 2003 లో షారుఖ్ ఖాన్ పేరిట ఉన్న ఈ రికార్డ్ ను.. అక్షయ్ ఖన్నా తన పేరిట లిఖించుకున్నాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్