Sunday, March 22, 2026 07:45 AM
Sunday, March 22, 2026 07:45 AM

గ్రాండ్‌గా అఖండ 2 ప్రీ రిలీజ్.. చీఫ్ గెస్ట్‌ ఎవరంటే..?

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఒక సినిమా గురించే హాట్‌ టాపిక్. అదే నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2. కరోనా మహమ్మారి సమయంలో థియేటర్లకు జనాలు వచ్చేందుకు భయపడుతున్న రోజుల్లో.. దాదాపు థియేటర్లు ఖాళీగా ఉన్న సమయంలో.. సరిగ్గా 2021 డిసెంబర్ 2న అఖండ సినిమా రిలీజ్ చేశారు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్‌. అప్పట్లో అన్ని రికార్డులు తిరగరాసింది. బాలయ్య శివ తాండవానికి థియేటర్లలో పూనకాలు వచ్చాయి. హౌస్ ఫుల్ కలెక్షన్లతో థియేటర్లకు పూర్వ వైభవం వచ్చిందనేది ఇప్పటికీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. ఆ తర్వాత నుంచి బాలయ్య వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ఇప్పుడు అదే బాలయ్య – బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అఖండ 2.

Also Read : బీజేపి చీఫ్ ఆయనే..? కేంద్ర మంత్రి వర్గంలో కీలక మార్పులు..!

అఖండ సీక్వెల్‌గా వస్తున్న అఖండ 2ను 14 రీల్స్ పతాకంపై బాలకృష్ణ కుమార్తె తేజస్విని, రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా రేంజ్‌లో తీసిన ఈ సినిమా ప్రమోషన్ వర్క్ ఇప్పటికే మొదలుపెట్టారు దర్శక నిర్మాతలు. సినిమా గ్లిమ్స్‌తో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆ తర్వాత అఖండ తాండవం పేరుతో వచ్చిన లిరికల్ సాంగ్ యూ ట్యూబ్‌లో దుమారం రేపుతోంది. హిందీ వర్షన్‌ ట్రైలర్‌ను ముంబైలో రిలీజ్ చేశారు. విశాఖలోని జగదాంబ థియేటర్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో జాజి కాయ పేరుతో ఉన్న పాటను లాంచ్ చేశారు. ఈ మాస్ట సాంగ్‌ చూసిన వారంతా వయసు పెరిగే కొద్ది అందరకీ అలుపు వస్తుంది.. కానీ బాలయ్యకు మాత్రం ఊపు వస్తుంది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ నెల 21న బెంగళూరులో కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్‌తో కలిసి భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు.

Also Read : ఐ బొమ్మతో పైరసీ నిజంగానే ఆగుతుందా..?

తాజాగా సినిమా బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్రాండ్‌గా ప్లాన్ చేస్తోంది. ఈ నెల 28న హైదరాబాద్‌లో అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకలోనే అఖండ 2 సినిమా ట్రైలర్ కూడా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్టుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్యతో అన్ స్టాపబుల్ షో‌లో పాల్గొన్న అల్లు అర్జున్.. తాను బాలయ్యకు ఎంత ఫ్యాన్ అనే విషయం ఆ షోలో తెలిపారు. బాలయ్య ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.. ఈవెంట్‌కు వచ్చేస్తా అంటూ ఆ షో లో మాటిచ్చారు బన్నీ. ఫుష్పాతో పాన్ వరల్డ్ స్టార్‌గా మారిన బన్నీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వస్తే.. సినిమాకు మరింత పబ్లిసిటీ వస్తుందనేది దర్శక, నిర్మాతల భావన. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా జూబ్లిహీల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో సినీ పరిశ్రమపై హామీల వర్షం కురిపించారు. అందుకే అదే నియోజకవర్గంలో జరిగే అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తున్నారనే మాట వినిపిస్తోంది. మొత్తానికి అఖండ 2 బాలయ్య కెరీర్‌లో హై రేంజ్ సినిమా అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్