Wednesday, February 4, 2026 08:05 AM
Wednesday, February 4, 2026 08:05 AM

దురంధర్ ను భయపెడుతున్న అఖండ..?

గత పదేళ్ల నుంచి టాలీవుడ్ కథ మారుతోంది. సినిమా అంటే హిందీ సినిమా అనుకునే రోజులనుంచి.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీని బయటకు తీసుకువచ్చింది తెలుగు సినిమా. బాలీవుడ్ సినిమాలకు సవాల్ చేయడమే కాదు.. బాలీవుడ్ మీడియా మొత్తం తెలుగు సినిమా గురించే మాట్లాడేలా పరిస్థితి తీసుకొచ్చింది. ముఖ్యంగా హిందుత్వ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలకు ఇండియా వైడ్ గా మంచి రెస్పాన్స్ ఉంటుంది. పాన్ ఇండియా ట్యాగ్ లైన్ తో వచ్చే ఈ సినిమాలకు కలెక్షన్లు కూడా భారీగానే ఉంటున్నాయి. ఇప్పుడు మన తెలుగు నుంచి మరో పాన్ ఇండియా సినిమా ఇదే బ్యాక్ డ్రాప్ లో రిలీజ్ అవుతుంది.

Also Read : పార్లమెంట్ ను కుదిపేసిన ఈ సిగరెట్..!

అదే అఖండ సీక్వెల్.. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో, బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై, భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి బాలీవుడ్ ఆసక్తిగా చూస్తోంది. కారణం 2021 లో అఖండ మొదటి పార్ట్ కు వచ్చిన రెస్పాన్స్. ఓటిటిలో ఎక్కువగా హిందీ బెల్ట్ డామినేషన్ ప్రదర్శించింది అఖండ. దీనితో నార్త్ ఆడియన్స్ ను బేస్ చేసుకుని.. సినిమాను మహాకుంభమేళాలో చిత్రీకరించాడు డైరెక్టర్ బోయపాటి. ఆ సీన్లు సినిమాలో హైలెట్ గా నిలవనున్నాయి. దాదాపుగా 15 రోజులపాటు అక్కడ ఈ సినిమా షూటింగ్ జరిగింది.

Also Read : దేవుడా.. టీటీడీలో మరో భారీ మోసం..!

ఇదే అఖండ సీక్వెల్ కు ప్లస్ అవుతుంది అంటున్నారు అనలిస్ట్ లు. అటు బాలీవుడ్ నిర్మాతలు కూడా కలెక్షన్లపై దృష్టి పెట్టారు. ప్రమోషన్స్ కూడా భారీగా జరగడం, ఈ మధ్యకాలంలో హిందూ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలకు అదిరిపోయే రెస్పాన్స్ ఉండటంతో.. ఈ సినిమా ఇచ్చే రిజల్ట్ తదుపరి బాలీవుడ్ సినిమాలు పై ఏ విధంగా పడుతుంది అనేది అక్కడ కనపడని ఆందోళన ఉంది. ప్రస్తుతం ఉన్న సినిమాలకు సంబంధించి నిర్మాతల్లో కూడా ఒకరకంగా ఆందోళన ఉందని చెప్పాలి. రన్వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ టైం లో రిలీజ్ అవుతున్న అఖండ ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందో అని బాలీవుడ్ మీడియా లెక్కలు వేసుకుంటుంది. ఉత్తర ప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ఆ సినిమా కలెక్షన్లపై కొంత ప్రభావం పడే అవకాశాలు ఉండొచ్చని అంచనా వేస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్