Sunday, March 22, 2026 09:14 AM
Sunday, March 22, 2026 09:14 AM

గాయాల టీం ఇండియా.. కలవరపెడుతున్న సమస్యలు..!

సౌత్ ఆఫ్రికాతో వన్డే సీరీస్, టి20 సీరీస్.. ఇప్పుడు న్యూజిలాండ్ తో తొలి వన్డేలో గెలిచి ఊపు మీదున్న భారత జట్టును వరుస గాయాలు ఇబ్బంది పెడుతున్నాయి. కీలక ఆటగాళ్ళు జట్టుకు దూరమవుతున్నారు. ఇటీవల శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా దూరమయ్యాడు. ఇటీవలే అతను మళ్ళీ జట్టులో జాయిన్ అయ్యాడు. అటు టి20 వరల్డ్ కప్ నుంచి తిలక్ వర్మ శస్త్ర చికిత్స కారణంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. హార్దిక్ పాండ్యాకు సైతం గాయం సమస్య ఉండటంతో వన్డే జట్టు నుంచి తప్పించారు.

Also Read : పోలవరం వాడుకోండి.. తెలంగాణాకు చంద్రబాబు చురకలు..!

ఇటీవల వికెట్ కీపర్ రిషబ్ పంత్ సైతం గాయం కారణంగా న్యూజిలాండ్ తో వన్డే సీరీస్ కు దూరమైన సంగతి తెలిసిందే. మంచి ఫాంలో ఉన్న గిల్.. వైట్ బాల్ క్రికెట్ పై ఫోకస్ చేసిన సమయంలో ఈ పరిస్థితి నెలకొంది. తాజాగా మరో కీలక ఆటగాడు గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. తాజాగా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా న్యూజిలాండ్ తో జరుగుతోన్న వన్డే సీరీస్ నుంచి తప్పుకున్నాడు. జట్టులో స్పిన్నర్ గా, బ్యాట్స్మెన్ గా నిలకడగా రాణిస్తున్న సుందర్.. తప్పుకోవడం కాస్త ఇబ్బందే.

Also Read : తెలంగాణలో పవన్ తో బీజేపీ గేమ్ ప్లాన్ రెడీ..?

అటు బూమ్రా ఫిట్నెస్ సమస్యలతో కొంత ఇబ్బంది పడుతున్నాడు. దీనితో అతను టి20 సీరీస్ లో ఆడతాడా లేదా అనేది ప్రధాన ప్రశ్నగా మారింది. ఇలా గాయాలతో టీం ఇండియా ఇబ్బంది పడుతోంది. ఇటీవలే గాయం నుంచి కోలుకుని.. శుభమన్ గిల్ తిరిగి జట్టులో జాయిన్ అయ్యాడు. ఇదిలా ఉంచితే.. గాయం నుంచి కోలుకున్న ఆటగాళ్ళు తిరిగి జట్టులోకి రావడం కష్టంగా మారడంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. షమీ జట్టుకు దూరమైన తర్వాత ఇప్పటి వరకు జాతీయ జట్టుకు ఎంపిక కాలేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్