భారతీయ రైల్వే వ్యవస్థ అత్యాధునిక వైపు పరుగులు పెడుతోంది అనేది ఇప్పుడు బాగా వినిపిస్తున్న మాట. ఓ వైపు వందేభారత్ వంటి సెమీ హైస్పీడ్ రైళ్లు పరుగులు పెడుతున్నాయని.. మరో వైపు.. త్వరలోనే బుల్లెట్ రైలు ప్రారంభం అవుతుందని ప్రభుత్వ పెద్దలు పదే పదే చెబుతున్నారు. అయితే.. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. సాధారణ, మధ్య తరగతి ప్రజల కష్టాలు మాత్రం తీరటం లేదు. ఇంకా చెప్పాలంటే.. రెట్టింపు అయ్యాయి. అన్ని సూపర్ ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో జనరల్ బోగీల సంఖ్య తగ్గిపోయింది. ఇక స్లీపర్ కోచ్ సంగతి సరే సరి. గతంలో 16 కోచ్‌ల స్థానంలో ఇప్పుడు 8 మాత్రమే ఉంటున్నాయి. మిగిలినవన్నీ ఏసీ క్లాస్‌లే.
ALso Read : ఈఎన్ఈ రిపీట్ రివ్యూ: కల్ట్ మ్యాజిక్ రిపీటైందా?
ఇక అసలు విషయం ఏమిటంటే.. రైళ్లల్లో ప్రయాణం చేయాలంటే.. రెండు నెలల ముందే రిజర్వేషన్ చేసుకోవాలి. ముందు కొన్ని టికెట్లను అందుబాటులో ఉంచుతారు. అవి పూర్తి అయితే.. ఆర్‌ఏసీ, వెయిటింగ్ లిస్ట్.. అంటూ కొన్ని టికెట్లు ఇస్తారు కూడా. చివరి నిమిషంలో ఎవరైనా రిజర్వేషన్ రద్దు చేసుకుంటే.. వారి స్థానంలో కోటా ప్రకారం.. ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్ వారికి టికెట్లు కేటాయిస్తారు. ఆర్ఏసీ వాళ్లు రైలులో ప్రయాణం చేయవచ్చు. కానీ వెయిటింగ్ లిస్ట్ వాళ్లకు మాత్రమే నో ఎంట్రీ. ఎందుకంటే.. చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత.. వెయిటింగ్ లిస్ట్.. అంటే.. సగం పైగా డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి. అందుకే వెయిటింగ్ లిస్టు టికెట్ ప్రయాణానికి పనికి రాదు.
అయితే రైల్వే శాఖ నిలువు దోపిడి ఎలా ఉందంటే.. కన్ఫామ్, ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్టు.. ఈ ముగ్గురి దగ్గర ఒకే ధర వసూలు చేస్తున్నారు. చివరి నిమిషంలో ఆర్ఏసీ అయినా వస్తుందనే నమ్మకంతో.. కొంతమంది రిజర్వేషన్ చేసుకుంటారు. కానీ.. సంక్రాంతి కోటా రైళ్ల టికెట్ బుకింగ్‌లో రైల్వే శాఖ నిలువు దోపిడీ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నగరాల నుంచి కోస్తాంధ్రలో ఉర్లకు ప్రతి ఒక్కరూ వస్తారు. ఆ రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు రైళ్లు, బస్సులు కూడా నడిపిస్తారు. అయితే.. ముందు రెగ్యులర్ రైళ్ల కోటా పూర్తి తర్వాతే స్పెషల్ రైలు వస్తుంది.
ALso Read : ఎన్టీఆర్ బాటలో పవన్.. కారణం..?
అయితే సంక్రాంతి రైళ్ల బుకింగ్ విషయంలో రైల్వే శాఖ చాలా దారుణంగా వ్యవహరిస్తోంది. రైలు సామర్థ్యం మించి టికెట్లు జారీ చేస్తుంది. సాధారణంగా వెయిటింగ్ లిస్టు జాబితా 150 నుంచి 200 మధ్యలోనే ఉంటుంది. కానీ.. తాజాగా రైల్వే శాఖ జారీ చేసిన టికెట్ల జాబితా చూస్తే మాత్రం.. ఆశ్చర్యమేస్తోంది. జనరల్ వెయిటింగ్ లిస్టు ఏకంగా వెయ్యి దాటిపోయింది. సాధారణంగా స్లీపర్ క్లాస్ రిజర్వేషన్‌లో బోగీకి 80 బెర్తులు ఉంటాయి. అంటే.. పది బోగీలకు 800 బెర్తులు. వీటిల్లో జనరల్ బుకింగ్, ఆర్ఏసీ తీసేస్తే.. మహా అయితే ఓ వంద వెయిటింగ్ లిస్టు ఉంటుంది. కానీ ఏకంగా వెయ్యి అంటే.. అంతా ఆశ్చర్యపోతున్నారు. రెండు నెలల ముందే ఈ రెంజ్‌లో టికెట్లు అమ్మేసి.. ఆ డబ్బులను తీరిగ్గా రెండు నెలల తర్వాత.. సరిగ్గా ప్రయాణానికి ఓ నాలుగు గంటల ముందు తిరిగి ఇస్తుంది రైల్వే శాఖ. అప్పుడు టికెట్లు దొరకక నానా పాట్లు పడాల్సిందే. అసలు వెయ్యి వెయిటింగ్ లిస్ట్ ఏమిటనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఇది రైల్వే శాఖ నిలువు దోపిడి అనే మాట ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది.


