కారు కూతలు కూస్తున్న వారి నోటికి తాళం వేయాలంటే దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు బాటలోనే జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా నడవాల్సిందేనా..?. చంద్రబాబును రెండు దఫాలు ముఖ్యమంత్రిని చేసింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేది టీడీపీ నాయకులు, కార్యకర్తల నమ్మకం. అందుకు నిదర్శనం, 2014, 2024 ఎన్నికల ఫలితాలే. ఆ రెండు దఫాలు చంద్రబాబు సీఎం అయ్యారంటే పవన్ కళ్యాణ్ మద్దతు మాత్రమే కారణం అంటున్నారు. ఆయన మద్దతు లేదు కాబట్టే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది అంటున్నారు.
Also Read : ఈఎన్ఈ రిపీట్ రివ్యూ: కల్ట్ మ్యాజిక్ రిపీటైందా?
పవన్‌కు ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు కుటుంబం పరంగా ఎదురయ్యాయి. ఆ ఇబ్బందుల నుండి పవన్ కళ్యాణ్ బయట పడాలన్నా, జాతీయ స్థాయిలో రాజకీయంగా రెట్టింపు బలపడాలన్నా.. దివంగత సీఎం ఎన్టీఆర్ నడిచిన బాటలో పవన్ నడవాల్సిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక అసలు విషయం ఏమిటంటే.. 1983లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. సన్యాసం తీసుకుని, కాషాయ వస్త్రధారణ చేశారు. అప్పటి నుండి ఉత్తరాది ప్రజలు, ఆ ప్రాంతపు రాజకీయ పార్టీల నాయకులు కూడా ఎన్టీఆర్‌ను గౌరవంగా స్వామీజీ అనీ పిలవటం ప్రారంభించారు. అప్పటి రాష్ట్రపతి దివంగత జైల్ సింగ్ కూడా ఎన్టీఆర్‌ను స్వామీజీ అనే పిలిచారు. కాషాయ వస్త్రధారణ తీసేసిన తర్వాతే ఎన్టీఆర్ అధికారం కోల్పోవటం జరిగింది. అంతే కాదు అకాల మరణం కూడా అందుకే అనేది జగమెరిగిన సత్యం.
తాజాగా పవన్ కళ్యాణ్‌కు కుటుంబ పరంగా ఎదురైన ఘటనలు ఆయనకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకోగలిగితే చాలా మంది నోటికి తాళం పడుతుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటికే సనాతన ధర్మం పేరును పదే పదే పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పూర్తిగా కాషాయ వస్త్రధారణతో సన్యాసిగా మారితే అన్ని విధాలుగా కలిసొచ్చే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయంగా, అటు ఉత్తరాదిన కూడా కలిసి రావటం ఖాయం. త్వరలో పవన్ కళ్యాణ్ నాల్గవ పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలోకొందరు పనిగట్టుకుని మరీ చేస్తున్న ప్రచారానికి కూడా ఫుల్ స్టాప్ పడుతుంది. ప్యాకేజి జ్యోతిష్యం వేణు స్వామి అప్పుడెప్పుడో చెప్పిన జోస్యం కూడా అబద్దం అవుతుంది.
Also Read : కూటమిలో తేలని జెడ్పీల లెక్క! టీడీపీకి 22.. జనసేనకు 4?
ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను అనుకూలంగా మలుచు కోవాలంటే దివంగత ఎన్టీఆర్ నడిచిన బాటలో పవన్ కళ్యాణ్ నడవగలిగితే రాజకీయంగా ఇప్పటికన్నా ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగటం ఖాయం అనీ రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. కొసమెరుపు ఏమిటంటే.. పరస్పర అవగాహనతో మూడవ భార్యతో పవన్ కళ్యాణ్ భార్యాభర్తలుగా విడిపోయిన నేపథ్యంలో అదిగో.. ఇదిగో.. పవన్ కళ్యాణ్ పలానా మహిళను నాల్గవ పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఎన్టీఆర్ చూపిన దారిలో పవన్ కళ్యాణ్ నడవగలిగితే రాజకీయంగా ఆయనకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఎంతో మైలేజ్ వస్తుందని సీనియర్ రాజకీయ విశ్లేషకులే చెబుతున్నారు.


