Thursday, November 19, 2026 08:00 PM
Thursday, November 19, 2026 08:00 PM

కాకినాడ పరిణామం.. సిక్కోలుకు సంకేతమా..?

శ్రీకాకుళం జిల్లా పరిషత్ పీఠం ఎవరికి దక్కనుంది? కూటమి పార్టీల్లో ఎవరికి అవకాశం కల్పించనున్నారు? జడ్పీ ఛైర్ పర్సన్ పదవిపై రాజకీయ వర్గాల్లో అప్పుడే చర్చ మొదలైంది. కాకినాడ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవిని తెలుగుదేశం పార్టీకి కేటాయించినట్లు వస్తున్న సమాచారంతో శ్రీకాకుళం జిల్లాలో కూడా అదే ఫార్ములా అమలవుతుందా? అన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. కాకినాడలో మేయర్ పీఠాన్ని జనసేనకు కేటాయించిన నేపథ్యంలో, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవిని టీడీపీకి కేటాయించినట్లు సమాచారం. ఈ పరిణామం శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కూడా కొత్త సమీకరణాలకు తెరలేపింది. అయితే ఇక్కడ కూడా ఇదే విధమైన పదవుల పంపకం ఉంటుందా? అన్నది అధికారిక నిర్ణయం వెలువడితేనే స్పష్టత రానుంది.

Also Read : ఈఎన్ఈ రిపీట్ రివ్యూ: కల్ట్ మ్యాజిక్ రిపీటైందా?

శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవికి సంబంధించి ప్రధానంగా రెండు పేర్లు రాజకీయ చర్చల్లో వినిపిస్తున్నాయి. టీడీపీ నుంచి తమ్మినేని సుజాత, జనసేన నుంచి కొరికాన భవానీ పేర్లు తెరపైకి వస్తున్నాయి. తమ్మినేని సుజాతకు సంబంధించి పార్టీ వర్గాల్లో రాజకీయ ప్రాధాన్యం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న నాయకత్వంతో ఆమెకు ఉన్నట్లు చెబుతున్న సాన్నిహిత్యం ఇప్పుడు ప్రస్తావనకు వస్తోంది. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆశీస్సులతో పాటు పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ మద్దతు ఆమెకు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

మరోవైపు జనసేన పార్టీ నుంచి కొరికాన భవాని పేరు పరిశీలనలో ఉన్నట్లు చర్చ సాగుతోంది. ఆమెకు రాజకీయాల్లో కొత్తదనం ఉన్నప్పటికీ కూటమి పొత్తులో భాగంగా జనసేనకి జెడ్పీ పీఠం కేటాయిస్తారన్న నేపథ్యంలో భవానీ సైతం తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలను కలుస్తున్నారు. ఆమెకి గ్రీన్ సిగ్నెల్ రావడంతోనే అందరిని కలుస్తున్నారనే చర్చ జరుగుతుంది. భవానీ భర్త కొరికాన రవికుమార్ జనసేనలో పాతపట్నం నియోజకవర్గ ఇన్ ఛార్జిగా వ్యవహరించడంతో పాటు శ్రీకాకుళం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ.. సుడా చైర్మన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జనసేనాని ఆశీస్సులు కొరికాన కుటుంబానికి సంపూర్ణంగా ఉండడంతో భవానికి జడ్పీ పీఠం దక్కుతుందని జనసేన సైనికులు ఆశాభావంతో ఉన్నారు.

Also Read : అమరావతిలో మీడియా సిటీ.. లక్ష మంది యువతకు ఉద్యోగాలు

కాకినాడ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవిపై కూడా కూటమి పార్టీల మధ్య పోటీ నెలకొంది. టీడీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన పిల్లి అనంతలక్ష్మి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మరోవైపు జనసేన నుంచి బుర్ర సునీత దివ్యరాజు పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లాల వారీగా పదవుల కేటాయింపుపై కూటమి నాయకత్వం ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందన్నది కీలకంగా మారింది. కూటమి పార్టీల మధ్య తుది పదవుల పంపకం ఇంకా ఖరారు కాలేదు. అందువల్ల అధికారిక ప్రకటన వచ్చే వరకు టీడీపీకి లేదా జనసేనకు పీఠం ఖరారైనట్లు చెప్పలేమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. జిల్లాలవారీగా కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తాయా? అన్నది ఈ నెల 20నే తేలనుంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

భారతీయ రైల్వే.. బాబోయ్.....

భారతీయ రైల్వే వ్యవస్థ అత్యాధునిక వైపు...

2028–29 ఎన్నికలు వేరే...

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే శాసనసభ ఎన్నికలు...

ఎన్టీఆర్ బాటలో పవన్.....

కారు కూతలు కూస్తున్న వారి నోటికి...

కూటమిలో తేలని జెడ్పీల...

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్లు, వైస్‌...

మిశ్రాకు బ్రేకులు పడుతున్నాయా..?

ఐఏఎస్ కార్తికేయ మిశ్రాను సీఎంఓ నుంచి...

ఈఎన్ఈ రిపీట్ రివ్యూ:...

‘పెళ్ళిచూపులు’తో తనదైన ముద్ర వేసిన దర్శకుడు...

పోల్స్