ఐఏఎస్ కార్తికేయ మిశ్రాను సీఎంఓ నుంచి తప్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకుంటున్నారా..? ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేస్తున్న అత్యంత వివాదాస్పద ఐఏఎస్ అధికారిగా పేరున్న కార్తికేయ మిశ్రాను సీఎంఓ నుండి తప్పించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతే కాకుండా సీఎంఓలో పనిచేస్తున్న మరో ఐఏఎస్ అధికారి ప్రద్యుమ్నతో అప్పుడప్పుడు అకారణంగా గొడవలు పెట్టుకుంటున్నారన్న ఆరోపణలు కూడా బయటకు వస్తున్నాయి. ఇక సీఎంఓలో తన మాటే చెల్లుబాటు కావాలని మిశ్రా గట్టిగా పట్టు పడుతున్నారట. మిశ్రాను ఇన్నాళ్లు సీఎం చంద్రబాబు ఎలా భరించారో..? అనే మాట బాగా వినిపిస్తోంది.
Also Read : బండ్ల గణేష్‌కు ఒంగోలు కోర్టు భారీ షాక్..!
ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఫోన్లో దొరకరు. ఒకవేళ అందుబాటులోకి వచ్చినా కనీస మర్యాద ఇవ్వరనేది మిశ్రా పై ఉన్న అరోపణ. వ్యక్తిగతంగా మిశ్రాను కలిసేందుకు ప్రయత్నించినా కూడా అంతంత మాత్రంగానే కలుస్తారట. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారులతోనే మిశ్రా సన్నిహితంగా ఉంటారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారులకే కీలక ప్రాధాన్యత పోస్టులు రావడం వెనుక మిశ్రా కీలకంగా వ్యవహరించారనే ప్రచారం కూడా వుంది. మిశ్రా అవినీతి పరుడా, నిజాయతీ పరుడా అనే విషయం పక్కన పెడితే.. “అవినీతి ఆరోపణలు వచ్చిన, వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారులతోనే మిశ్రా ఎక్కువగా సన్నిహితంగా ఉంటారటా..!.
Also Read : ధనుష్ ‘ఓం’ ప్రివ్యూ టాక్.. మమ్ముట్టి గ్యాంగ్‌లో స్పై..!
కొసమెరుపు ఏమిటంటే.. సీఎంఓలో కార్తికేయ మిశ్రాను చంద్రబాబు స్వయంగా నియమించుకున్నారు. మంత్రి నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడు అనే పేరు కూడా ఉంది. ఇదే విషయాన్ని మిశ్రా గతంలో స్వయంగా చెప్పారు కూడా. కానీ ఎందుకో తెలియదు కానీ.. ఇప్పుడు ఆ విధంగా చెప్పుకోవటం లేదు. ఈయనను కాలకేయుడు అని, కాలకేయ మిశ్రా అని కూడా కొందరు ఆఫ్ ది రికార్డుగా పిలుస్తుంటారు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత మిశ్రాను చంద్రబాబు తప్పించటం ఖాయం అని విశ్వసనీయ వర్గాల సమాచారం.


