స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన అధికారిక హోదాకు ఉండే భారీ భద్రతా వలయాన్ని, హంగూ ఆర్భాటాలను, కాన్వాయ్‌ను పూర్తిగా పక్కనపెట్టేసి ఒంటరిగా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ క్షేత్రస్థాయిలో రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్న తరుణంలో, ఎటువంటి ప్రొటోకాల్స్ లేకుండా పవన్ కల్యాణ్ నేరుగా సీఎం నివాసానికి వెళ్లడం ఆసక్తిని రేపుతోంది.
Also Read : రాచమల్లు.. బరితెగింపు అంటే ఇదే..!
ఈ అగ్రనేతలిద్దరి మధ్య ప్రధానంగా సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు, తదుపరి లీగల్ పరిణామాలపైనే సుదీర్ఘంగా చర్చలు నడిచినట్లు తెలుస్తోంది. నామినేషన్ల వివాదంపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల వల్ల 19 మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడటం, అభ్యర్థుల తుది జాబితా వాయిదా పడటాన్ని ఇరు నేతలు తీవ్రంగా పరిగణించారు. ప్రతిపక్ష వైసీపీ కోర్టులను ఆశ్రయించి ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని భావిస్తున్న కూటమి పెద్దలు..
Also Read : ధోని కెప్టెన్సీపై హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..!
ఈ న్యాయపరమైన చిక్కులను ఎలా ఎదుర్కోవాలి, ఎస్ఈసీ తీసుకోబోయే తదుపరి అడుగులపై ప్రభుత్వ పరంగా ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే దానిపై లోతుగా చర్చించినట్లు సమాచారం. కేవలం కోర్టు వ్యవహారాలే కాకుండా, సీట్ల సర్దుబాటు తర్వాత కొన్ని జిల్లాల్లో తలెత్తిన కూటమి రెబల్స్ సమస్యపై కూడా ఈ భేటీలో ఒక పక్కా రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. గుంటూరు, నెల్లూరు వంటి కీలక ప్రాంతాల్లో స్థానిక నేతల మధ్య ఉన్న అసంతృప్తులను తక్షణమే పరిష్కరించి, టీడీపీ-జనసేన-బీజేపీ శ్రేణులు సమిష్టిగా పనిచేసేలా క్షేత్రస్థాయి ఇన్ఛార్జ్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని నిర్ణయించారు.


