Thursday, October 22, 2026 02:05 PM
Thursday, October 22, 2026 02:05 PM

దావూద్ పాక్ లోనే.. ఐరాసాలో భారత్ సంచలన కామెంట్స్..!

ఐక్యరాజ్యసమితిలో భారత్ మరోసారి ఉగ్రవాద దేశం పాకిస్తాన్ తీరును ప్రపంచ దేశాల ముందు ఎండగట్టింది. ఐరాసకు చెందిన కౌంటర్ టెర్రరిజం ప్రత్యేక ప్రతినిధి బెన్ సాల్ తన జూలై నివేదికలో భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం భారతదేశంలోనే ఉన్నట్లు పేర్కొనడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నివేదికలోని తప్పులను ఎత్తిచూపుతూ ఐరాసలో భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ రఘు పురి ఐరాస వేదికగానే గట్టిగా సరిదిద్దారు.

Also Read : బ్రేకింగ్: ఏపీ ఎన్నికల కమీషన్ సంచలన నిర్ణయం..!

ఈ సందర్భంగా రఘు పురి మాట్లాడుతూ.. దావూద్ ఇబ్రహీం 2003లో ఐరాస ఉగ్రవాదుల జాబితాలోకి ఎక్కకముందే భారత్ నుండి పారిపోయాడని, అల్-ఖైదా, ఒసామా బిన్ లాడెన్‌లతో సంబంధాలు ఉన్నందునే అతనిపై ఆంక్షలు విధించారని స్పష్టం చేశారు. 1993 ముంబై పేలుళ్ల సమయం నుంచే దావూద్ భారత్‌కు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని, ఈ నివేదికలో ఆ వాస్తవాలను దాచడం ఐరాస ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. “గతంలో ఒసామా బిన్ లాడెన్ ఎక్కడైతే దొరికి హతమయ్యాడో, ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం కూడా అదే దేశంలో ఆశ్రయం పొందుతున్నాడు” అని పాకిస్తాన్ పేరు ఎత్తకుండానే రఘు పురి కౌంటర్ ఇచ్చారు.

Also Read : మళ్లీ మొదలుపెట్టారు.. బీ అలర్ట్..!

ముంబై 26/11 ఉగ్రదాడుల సూత్రధారులతో సహా భారత్‌కు కావాల్సిన ఎంతోమంది ఉగ్రవాదులు దశాబ్దాలుగా పాకిస్తాన్‌లోనే స్వేచ్ఛగా జీవిస్తున్నారని భారత్ మరోసారి ప్రపంచానికి గుర్తుచేసింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఐరాస మానవ హక్కుల వేదికలను వాడుకోవడం ఫ్యాషన్‌గా మారిందని మండిపడింది. కాగా, ఐరాసలో కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలను పూర్తిగా తిప్పికొట్టిన భారత్.. జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని స్పష్టం చేసింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ప్రొటోకాల్స్ పక్కనపెట్టి సీఎం...

స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఏపీలో...

ఏపీ మున్సిపల్ ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల...

మళ్లీ మొదలుపెట్టారు.. బీ...

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చాలు.....

రాచమల్లు.. బరితెగింపు అంటే...

"రాజకీయాల్లో మరీ బరితెగించారు.. ఎంత దారుణమంటే.....

బ్రేకింగ్: ఏపీ ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో అత్యున్నత...

మంత్రి నియోజకవర్గంలో కూటమికి...

మంత్రి గుమ్మడి సంద్యారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న...

పోల్స్