వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చాలు.. ఫేక్ ప్రచారానికి కేరాఫ్ అడ్రస్ అనే విషయం అందరికీ తెలుసు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ మాజీ మంత్రి, జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఉదంతం. ముందు గుండె పోటు.. తర్వాత గొడ్డలి పోటు.. ఆ తర్వాత దానిని నారాసుర రక్తచరిత్ర అంటూ ఫేక్ ప్రచారం. అధికారంలోకి వచ్చిన తర్వాత.. తూచ్.. మేము అలా అనలేదు.. అని నాలుక మడత పెట్టేశారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఎర్ర బస్సు కూడా రాని ఊరికి ఎయిర్ బస్ ఎందుకన్నారు. చివరికి దానిని ప్రారంభించిన తర్వాత.. అంతా నా వల్లే.. మొత్తం నేనే చేశానంటూ ఊదరగొట్టే ప్రయత్నం చేశారు. అందుకే ఆ పార్టీ నేతల మాటలను ప్రజలు నమ్మటం పూర్తిగా మర్చిపోయారు.
Also Read : మంత్రి నియోజకవర్గంలో కూటమికి రెబల్స్ తలనొప్పి..!
ఇప్పుడు కూడా ఇలాంటి ప్రచారానికే వైసీపీ నేతలు తెర లేపారు. అయితే ఈసారి ఫేక్ ప్రచార బాధ్యతను వైసీపీ సోషల్ మీడియా, అనుకూల మీడియా, భజన పాత్రికేయులు తీసుకున్నారు. నిజానికి ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను ఈ నెల 25వ తేదీ వరకు వాయిదా వేయాలని మాత్రమే రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే వైసీపీ మాత్రం.. మొత్తం ఎన్నికలనే రద్దు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని ప్రచారం చేశారు. ఆ తర్వాత సుప్రీం కోర్టు తీర్పు కాపీ బయటకు రావడంతో.. నోరు మూసుకున్నారు. ఇక ఇప్పుడు మరో కొత్త నాటకానికి తెర లేపింది వైసీపీ సోషల్ మీడియా.
ఈ నెల 25వ తేదీ వరకు అభ్యర్థుల తుది జాబితా వాయిదా వేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో అది ఎన్నికల నిర్వహణ తేదీలపై కూడా ప్రభావం చూపిస్తోంది. దీంతో పోలింగ్ తేదీలు కూడా మారనున్నాయి. కార్పొరేషన్లు, మునిసిపల్, నగర పంచాయతీల ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న జరగాల్సి ఉంది. సుప్రీం ఉత్తర్వుల నేపథ్యంలో వారం రోజుల పాటు వాయిదా వేయాల్సి వస్తుంది. ఇందుకు ప్రధాన కారణం.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు. నవంబర్ 3న జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. దీంతో ఎన్నికల విధుల్లో అవసరమైన పోలీసు సిబ్బంది అందుబాటులో ఉండే పరిస్థితి లేకపోవడంతో.. మునిసిపల్ ఎన్నికలు వాయిదా తప్పనిసరి.
అయితే ఇదే ఇప్పుడు వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. కూటమిలో కుంపటి.. అంటూ ఫేక్ ప్రచారం మొదలుపెట్టారు. అమాయకులైన వైసీపీ నేతలపైన టీడీపీ నేతల దాడుల వల్లే ఎన్నికలు వాయిదా పడ్డాయని.. ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారంట. అసలు ఇలాంటి వారితోనా నేను పొత్తు పెట్టుకున్నది అని .. పవన్ అన్నారట. “నా దారి నేను చూసుకుంటా.. నాకు మీరు వద్దు.. మా మంత్రులందరూ రాజీనామా చేస్తారు.” అని పవన్ వ్యాఖ్యానించారని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. నారా లోకేష్ తీరుపైన పవన్ ఆగ్రహంతో ఉన్నారని.. త్వరలో ప్రభుత్వం నుంచి జనసేన బయటకు వస్తుందంటూ.. సోషల్ మీడియాలో అనుకూల పెయిడ్ ఆర్టిస్టులతో ఊక దంపుడు ఫేక్ ప్రచారం చేయిస్తున్నారు.
Also Read : వైభవ్ సూర్యవంశీపై శ్రేయస్ అయ్యర్ బోల్డ్ స్టేట్‌మెంట్..!
అయితే నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మొదలైన రోజు నుంచి పవన్ కళ్యాణ్ సహా జనసేన పార్టీ నేతలు ఎక్కడా ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. ఇంకా చెప్పాలంటే.. రాష్ట్రంలో మొదటి ఏకగ్రీవ మునిసిపాలిటీ దర్శి. జనసేన అభ్యర్థి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే విజయవాడలో వంగవీటి రాధ గెలుపు ఖాయమని ఇప్పటికే తేల్చేశారు. దీంతో.. జనసేన పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు కూడా. ఎక్కడా ఎన్నికలపైన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా గతంలో వైసీపీ వాళ్లు తమపైన, టీడీపీ నేతలపైన దాడులు చేసిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. మరోవైపు పవన్, లోకేష్ మధ్య మంచి సంబంధాలున్నాయి. ఈ ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించేందుకు తొలి నుంచి వైసీపీ నేతలు నానా పాట్లు పడుతున్నారు. ఇప్పుడు కూడా అదే మాదిరిగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి.. కూటమి నేతలు, అభిమానులు, కార్యకర్తలు.. తస్మాత్ జాగ్రత్త. వైసీపీ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టకపోతే.. భారీ నష్టం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


