Wednesday, October 21, 2026 08:54 PM
Wednesday, October 21, 2026 08:54 PM

పల్నాడు పాలిటిక్స్‌లో హైటెన్షన్.. అజ్ఞాతంలోకి మాజీ ఎమ్మెల్యే..!

పల్నాడు జిల్లా నరసరావుపేట రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లడం స్థానికంగా పెను సంచలనంగా మారింది. నిన్న సాయంత్రం నుంచి ఆయన తన మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి, అనుచరులకు గానీ, కిందిస్థాయి క్యాడర్‌కు గానీ ఎవరికీ అందుబాటులో లేకుండా పోవడంతో పార్టీ శ్రేణుల్లో రకరకాల అనుమానాలు, తీవ్ర చర్చ మొదలైంది.

Also Read : తాడేపల్లిలో జగన్ ఎమర్జెన్సీ మీటింగ్.. సంచలన నిర్ణయం..?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వం క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో, అధికార పార్టీ శ్రేణుల నుంచి ఎదురవుతున్న అడ్డంకులు, వ్యూహాలను చిత్తు చేస్తూ, నామినేషన్ దాఖలు చేసేందుకు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏ క్షణంలోనైనా అకస్మాత్తుగా నరసరావుపేటలో ప్రత్యక్షమయ్యే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది. కూటమి నేతలకు దొరకకుండా, వ్యూహాత్మకంగా చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చి నామినేషన్ కేంద్రానికి చేరుకోవాలనే ప్లాన్‌తోనే ఆయన ఈ విధంగా అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

Also Read : సుప్రీం తీర్పు పై వైసీపీ ఫేక్ ప్రచారం..!

మరోవైపు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రాకపై సమాచారం అందుకున్న అధికార కూటమి పార్టీల నాయకులు, పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఆయన నరసరావుపేట నియోజకవర్గంలోకి అడుగుపెట్టకుండా చూసేందుకు, నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకు కూటమి నేతలు సైతం తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. దీనితో ముందస్తు జాగ్రత్తగా పోలీసులు నామినేషన్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో నరసరావుపేట రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో, ఎలాంటి ఉద్రిక్తతలకు దారితీస్తుందోనని పల్నాడు జిల్లా వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

రాచమల్లు.. బరితెగింపు అంటే...

"రాజకీయాల్లో మరీ బరితెగించారు.. ఎంత దారుణమంటే.....

బ్రేకింగ్: ఏపీ ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో అత్యున్నత...

మంత్రి నియోజకవర్గంలో కూటమికి...

మంత్రి గుమ్మడి సంద్యారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న...

SBI ఖాతాదారుల డేటా...

దేశంలోనే అత్యంత పెద్ద ప్రభుత్వ రంగ...

తాడేపల్లిలో జగన్ ఎమర్జెన్సీ...

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ...

సుప్రీం తీర్పు పై...

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల చుట్టూ జరుగుతున్న...

పోల్స్