Wednesday, October 21, 2026 10:53 PM
Wednesday, October 21, 2026 10:53 PM

తాడేపల్లిలో జగన్ ఎమర్జెన్సీ మీటింగ్.. సంచలన నిర్ణయం..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పులివెందుల పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకుని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముందుగా నిశ్చయించుకున్న షెడ్యూల్ ప్రకారం ఆయన పులివెందుల వెళ్ళాల్సి ఉండగా, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పర్యటనను వాయిదా వేసుకున్నారు. బెంగళూరు నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయం ద్వారా విజయవాడ చేరుకున్న ఆయన, తాడేపల్లిలోని తన నివాసంలో పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, ముఖ్య నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది.

Also Read : సుప్రీం తీర్పు పై వైసీపీ ఫేక్ ప్రచారం..!

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వేళ ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. స్థానిక ఎన్నికల నామినేషన్ల దాఖలులో అధికార కూటమి పార్టీల నేతలు తీవ్ర అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వైస్సార్సీపీ ఆరోపిస్తోంది. తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్ పత్రాలు వేయకుండా అడ్డుకుంటున్నారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై ఆయన ఇప్పటికే రాష్ట్ర గవర్నర్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా రాతపూర్వకంగా ఫిర్యాదులు పంపారు.

Also Read : ఈ ఎన్నికలు జగన్‌కు రిఫరెండమే..!

ఈ అత్యవసర భేటీపై ప్రస్తుతం రాజకీయ వర్గాలలో పలు రకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. కూటమి ప్రభుత్వ ఏకపక్ష ధోరణిని, నామినేషన్ల అడ్డుగింపులను నిరసిస్తూ వైస్సార్సీపీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిగా బహిష్కరించే యోచనలో ఉందా అనే చర్చ కూడా జోరందుకుంది. ఈ తాడేపల్లి అత్యవసర సమావేశంలో క్షేత్రస్థాయి నుంచి వచ్చిన నివేదికలను పరిశీలించిన అనంతరం, కూటమి పార్టీల ఆగడాలను ఎదుర్కొనేందుకు జగన్ ఎలాంటి రాజకీయ, న్యాయపరమైన వ్యూహాన్ని ఖరారు చేయబోతున్నారు, భవిష్యత్ కార్యాచరణపై ఎలాంటి కీలక నిర్ణయం ప్రకటించబోతున్నారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

రాచమల్లు.. బరితెగింపు అంటే...

"రాజకీయాల్లో మరీ బరితెగించారు.. ఎంత దారుణమంటే.....

బ్రేకింగ్: ఏపీ ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో అత్యున్నత...

మంత్రి నియోజకవర్గంలో కూటమికి...

మంత్రి గుమ్మడి సంద్యారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న...

SBI ఖాతాదారుల డేటా...

దేశంలోనే అత్యంత పెద్ద ప్రభుత్వ రంగ...

పల్నాడు పాలిటిక్స్‌లో హైటెన్షన్.....

పల్నాడు జిల్లా నరసరావుపేట రాజకీయాల్లో మరోసారి...

సుప్రీం తీర్పు పై...

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల చుట్టూ జరుగుతున్న...

పోల్స్