ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో ప్రతిస్తంభనను తొలగించేందుకు అమెరికా అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. తమ సైనిక అస్త్రగారంలోనే అతిపెద్ద అణ్వాయుధేతర బాంబుగా పేరుగాంచిన GBU-43/B Massive Ordnance Air Blast (MOAB) అంటే.. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ను ఇరాన్‌పై ప్రయోగించే అంశాన్ని ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ సిఎన్ఎన్ వెల్లడించింది.
Also Read : కూటమి సీట్ల పంపకం ఖరారు!
ఇరాన్ అణు నివాసాలు, కీలక ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ భారీ బాంబును ప్రయోగించాలని పెంటగాన్ యోచిస్తోంది. అయితే, ఈ అత్యంత శక్తివంతమైన బాంబు ఇరాన్ భూగర్భ అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేయగలదా అనే దానిపై రక్షణ నిపుణులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బాంబు విస్తృతమైన ఉపరితల ప్రాంతాన్ని క్షణాల్లో తుడిచిపెట్టడానికి ఉపయోగపడుతుందే తప్ప, భూమిలో చాలా లోతుగా నిర్మించిన సురక్షిత బంకర్లలోకి చొచ్చుకుపోయే సామర్థ్యం దీనికి లేదని నిపుణులు చెప్తున్నారు.
Also Read : నవంబర్ 1 నుంచి కాలర్ ఐడీ.. కేంద్రం సంచలన నిర్ణయం..!
అయినప్పటికీ, ఇరాన్‌కు తమ సైనిక శక్తిని చూపించి భయపెట్టేందుకు, ట్రంప్‌కు ఈ యుద్ధం నుండి గౌరవప్రదంగా వెనక్కి తగ్గే అవకాశం కల్పించేందుకే ఈ భారీ దాడి వ్యూహాన్ని రచిస్తున్నట్లు సమాచారం. గతంలో 2017 ఏప్రిల్‌లో ట్రంప్ తన మొదటి అధ్యక్ష కాలంలో ఆఫ్ఘనిస్తాన్లోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల భూగర్భ స్థావరాలపై ఈ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ను మొదటిసారిగా ప్రయోగించారు. ఒకవేళ ఇప్పుడు ఇరాన్‌పై దీనిని ఉపయోగిస్తే, అది ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా మధ్యప్రాచ్యంలో పెను సంక్షోభానికి దారితీస్తుందని అంతర్జాతీయ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. రాబోయే నవంబర్ మధ్యంతర ఎన్నికల ముందు డోనాల్డ్ ట్రంప్ తీసుకోబోయే ఈ నిర్ణయం అటు అమెరికా రాజకీయాల్లోనూ, ఇటు అంతర్జాతీయ రక్షణ రంగంలోనూ అత్యంత కీలకమవబోతోంది.


