Friday, October 16, 2026 02:59 PM
Friday, October 16, 2026 02:59 PM

పాపం.. వాళ్లంతా బకరాలేనా..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కోలాహలం మొదలైంది. ఇప్పటికే రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం.. ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. మరోవైపు కూటమి పార్టీల మధ్య కూడా సీట్ల కేటాయింపుపై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో తమ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారనే విషయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఓ జాబితా విడుదల చేశారు. ఎన్నికలంటే తమకు భయం లేదని.. అందుకే ముందే మా లిస్టు రెడీ అంటూ ప్రకటనలు కూడా చేస్తున్నారు వైసీపీ నేతలు. అయితే ప్రస్తుతం వైసీపీ నేతల జాబితా చూసిన తర్వాత.. చెప్పుకోవడానికే తప్ప.. ఈ జాబితా గెలుపు కోసం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Also Read : వైసీపీకి షాక్.. నా దగ్గర డబ్బుల్లేవ్ అంటున్న బెజవాడ మేయర్..!

విజయనగరం, విశాఖపట్నం, ఏలూరు, మచిలీపట్నం, ఒంగోలు, నెల్లూరు, కడప మేయర్ స్థానాలకు వైసీపీ అభ్యర్థులు ఖరారు అయ్యారు. ఈ ఏడు మేయర్ స్థానాల్లో ఐదు మహిళలకు కేటాయించారు. కడప, నెల్లూరు రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించగా.. విజయనగరం, ఒంగోలు ఆర్యవైశ్యులకు ఇచ్చారు. మిగిలిన మూడు స్థానాలను బీసీలకు ఇచ్చినట్లు ప్రకటించారు. అయితే జనరల్ మహిళకు కేటాయించిన విశాఖ స్థానాన్ని కూడా బీసీ మహిళకే ఇచ్చామని.. బీసీలు, మహిళలకు వైసీపీ అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం మరోలా ఉన్నాయి.

నిజానికి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న మేయర్ అభ్యర్థుల్లో గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉన్న వారికే ఇప్పుడు టికెట్ ఇచ్చినట్లుగా సొంత పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని విజయనగరం, విశాఖపట్నం మేయర్ స్థానాలకు పోటీ చేస్తున్న ఇద్దరు మహిళల గురించే ఎక్కువగా చర్చ నడుస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్సీ వరుదు కళ్యాణికి విశాఖ మేయర్ టికెట్ ఇచ్చింది వైసీపీ. నిజానికి విశాఖ జిల్లాలో వైసీపీ గ్రాఫ్ తొలి నుంచి అస్సలు బాలేదు. 2019 ఎన్నికల్లో కూడా విశాఖ నగరం పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే గెలిచారు. 2024 ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీ సాధించారు. ఇలాంటి చోట.. వరుదు కళ్యాణిని పోటీలో పెట్టడంపై విశాఖ వైసీపీ నేతలే ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళను విశాఖ మేయర్ స్థానానికి ఎలా ఎంపిక చేస్తారని అధినేతను నిలదీస్తున్నారు. ఓ వైపు ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు గంటా, విష్ణుకుమార్ రాజు, వెలగపూడి వంటి సీనియర్లను తట్టుకోవడం వరుదు కళ్యాణికి తలకు మించిన భారమే.

ఇక విజయనగరం జిల్లాలో వైసీపీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. చిన్న శ్రీను పార్టీ మారిన తర్వాత.. వైసీపీని నడిపించే నాధుడే కరువయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్న కోలగట్ల శ్రావణిని ఎన్నికల బరిలో దింపారు వైసీపీ నేతలు. మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తెగా మాత్రమే శ్రావణికి గుర్తింపు. తమకు టికెట్ వద్దని కోలగట్ల వర్గీయులు చెప్పినా కూడా.. బలవంతంగా ఎన్నికల గోదాలోకి దింపినట్లు తెలుస్తోంది.

Also Read : ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ వివాదం.. రంగంలోకి ఈడీ..!

ఇక విజయవాడ మేయర్ కుర్చీపై వైసీపీలో పెద్ద దుమారం రేగినట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ దాదాపు ఖాయమయ్యారు. దీంతో రాధకు గట్టి పోటీ ఇవ్వాలంటే.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన దేవినేని అవినాష్‌ను ఎన్నికల బరిలో నిలపాలని జగన్ భావించినట్లు తెలిసింది. అయితే ఇప్పటికే వరుసగా మూడుసార్లు ఓడిన అవినాష్.. మరోసారి ఓటమి ఖాయమని భావించి.. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అవినాష్ అందుబాటులోకి రాకపోవడంతో.. చివరి నిమిషంలో రాయన భాగ్యలక్ష్మి పేరును వైసీపీ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన భాగ్యలక్ష్మి కుటుంబం.. పోటీ చేసేందుకు ఏ మాత్రం సుముఖంగా లేనప్పటికీ.. వైసీపీ నేతలు బలవంతంగా పోటీ చేయిస్తున్నట్లు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. దీంతో.. పాపం.. వాళ్లంతా బకరాలే.. అనే మాట.. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో బాగా వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

బ్రేకింగ్: సాయికృష్ణ కేసు...

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టించిన...

అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

కూటమి సీట్ల పంపకం...

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో అధికార...

వైసీపీకి షాక్.. నా...

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల వేళ వైఎస్సార్...

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్...

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1...

జనసేన పోటీ సీట్లపై...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి...

పోల్స్