Thursday, October 15, 2026 02:25 PM
Thursday, October 15, 2026 02:25 PM

బెజవాడ పాలిట్రిక్స్.. రాధ ఫిక్స్.. లైన్‌లోకి బోండా..!

బెజవాడ రాజకీయాలు హాట్ హాట్‌గా మారిపోయాయి. మేయర్ కుర్చీ కోసం పోటీ రసవత్తరంగా మారిపోయింది. రాష్ట్రంలోనే రెండో పెద్ద సంస్థ. పైగా రాజధాని అమరావతికి అనుసంధానమైన ప్రాంతం. దీంతో విజయవాడ కార్పోరేషన్ మేయర్ పదవి కోసం పోటీ కూడా అదే స్థాయిలో ఉంది. విజయవాడ మేయర్ స్థానాన్ని జనసేనకు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధకృష్ణ జనసేనలో చేరడంతో.. ఈ విషయం దాదాపు ఖాయమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మేయర్ అభ్యర్థిగా రాధ పేరు ప్రకటన ఇక లాంఛనమే అనే మాట కూడా బాగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బెజవాడ కూటమిలో ఆసక్తికర విషయం ఇప్పుడు కలకలం రేపుతోంది.

Also Read : వైసీపీలో జగన్ ముందు అసలు సవాల్..!

విజయవాడ అంటేనే.. కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య అధిపత్య పోరు అనే మాట తొలి నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. విజయవాడ మేయర్ అభ్యర్థిగా కూటమి తరఫున వంగవీటి రాధ పోటీ చేస్తే.. వైసీపీ తరఫున దేవినేని అవినాష్ పోటీ చేయడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తొలి నుంచి దేవినేని, వంగవీటి కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. 2004, 2019 ఎన్నికలప్పుడు ఇద్దరు నేతలు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ.. కలిసిన సందర్భాలు అయితే లేవు. ఇప్పటికీ రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది కూడా. అందుకే రాధ పై అవినాష్‌ను పోటీలో నిలబెడితే.. ఫలితం వస్తుందనేది వైసీపీ నేతల మాట.

అయితే ఇదే సమయంలో కూటమిలో కూడా లుకలుకలు మొదలైనట్లు తెలుస్తోంది. విజయవాడ మేయర్ సీటుపైన తొలి నుంచి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర్రావు కన్నేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి.. తన కుమారుడు సిద్ధార్థ‌కు మేయర్ టికెట్ ఇవ్వాలని అధిష్ఠానం పెద్దలపై ఒత్తిడి తీసుకువచ్చారు కూడా. అదే సమయంలో విజయవాడ నగరంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నగరంలో ఏ మూల చూసినా.. విజయవాడ చూపు.. సిద్ధార్థ వైపు.. అనే ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు కనిపిస్తున్నాయి. రాజకీయ వేదిక అయినా.. విజయవాడ ఉత్సవ్ అయినా సరే.. సిద్ధార్దనే ముందు నిలబెడుతున్నారు బోండా ఉమ.

Also Read : అర్ధరాత్రి ట్వీట్ చేసిన జగన్.. క్యాడర్ కు లీకులు ఇస్తున్నట్టా..?

తాజాగా విజయవాడ మేయర్ టికెట్ వంగవీటి రాధాకృష్ణకు ఖాయమంటూ ప్రచారం హోరెత్తడంతో.. బోండా ఉమా, సిద్ధార్ధ టీమ్ రంగంలోకి దిగింది. పార్టీ టికెట్ ఇవ్వకపోతే.. ఇండిపెండెంట్‌గా అయినా సరే.. పోటీ చేసేందుకు రెడీ అంటూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా తమ అనుకూల మీడియాలో బెజవాడలో టీడీపీ వర్సెస్ జనసేన అంటూ హెడ్ లైన్‌తో వార్తలు రాయిస్తున్నారు కూడా. టికెట్ ఇవ్వకుంటే.. స్వతంత్ర పోరే.. అంటూ కూటమి నేతలను భయపెట్టేలా వార్తలు సర్క్యూలేట్ చేస్తోంది బోండా టీమ్. ఈ వార్తలపైన టీడీపీ అధిష్ఠానం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇది ఒకరకంగా పార్టీ పెద్దలను ధిక్కరించినట్లే అవుతుందంటున్నారు. ఇప్పటికే వైసీపీ మాజీ మంత్రి అంబటిని కలిసిన విషయంలో.. పార్టీ అధినేతకు బోండా వివరణ ఇచ్చుకున్నారు కూడా. అయినా.. ఆ తీరు మారలేదని.. ఇప్పుడు పార్టీ అధినేత నిర్ణయాన్నే ఎదిరించేలా ఇలా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తామని పరోక్షంగా బెదిరించడం ఏమిటని నిలదీస్తున్నారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే.. అది పరోక్షంగా వైసీపీ అభ్యర్థి గెలుపునకు కారణమవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదీ ఏమైనా.. బెజవాడ రాజకీయం రసవత్తరంగా మారింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

కేసుల ఉచ్చు బిగుస్తోందా?...

ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక కేసుల్లో చోటుచేసుకుంటున్న...

అర్ధరాత్రి ట్వీట్ చేసిన...

ఏపీ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

వంశీపై యార్లగడ్డ సంచలన...

ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉండే...

వైసీపీలో జగన్ ముందు...

“పార్టీ కోసం నిలబడేది ఎవరు..? పదవుల...

హైదరాబాద్ టీ20 ముంగిట...

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న...

ఏపీ బ్రాండ్ ఇమేజ్...

నవ్యాంధ్ర రాజధాని అమరావతి, చారిత్రక నగరమైన...

పోల్స్