వైఎస్సార్సీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఉన్న అక్రమాస్తులు, క్విడ్ ప్రో కో కేసుల్లో ఉచ్చు బిగుస్తోందా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ఏడేళ్లుగా పెండింగ్లో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల విచారణను వేగవంతం చేయాలని కోరుతూ దర్యాప్తు సంస్థలు వేసిన పిటిషన్ పై న్యాయస్థానాలు దూకుడు పెంచాయి. సీబీఐ కేసులతో పాటు ఈడీ నమోదు చేసిన మనీలాండరింగ్ కేసులను కూడా రోజువారీ ప్రాతిపదికన విచారణ జరపాలనే డిమాండ్లు తెరపైకి వచ్చాయి.
Also Read : సౌదీ అరామ్కోపై హౌతీల మిస్సైల్ దాడి.. భారత్ కు చుక్కలేనా..?
గత దశాబ్ద కాలంగా సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈడీకి సంబంధించిన 9 ప్రాసిక్యూషన్ ఫిర్యాదులు, డిశ్చార్జి పిటిషన్లు ఎటువంటి పురోగతి లేకుండా పేరుకుపోయాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక నేరాలు, వ్యవస్థాత్మక కుట్రలతో కూడిన ఈ కేసుల విచారణ నత్తనడకన సాగుతుండటంతో.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన త్వరితగతిన విచారణ జరిగే హక్కును పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ ఈడీ ఇటీవల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుల్లో నిందితులందరూ వ్యక్తిగతంగా హాజరయ్యేలా ఆదేశాలిచ్చి, రోజువారీ విచారణ జరిగేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో స్పష్టం చేసింది.
Also Read : రాహుల్ దెబ్బ.. కేంద్రంలో కలకలం..!
ఈ పరిణామాల నేపథ్యంలో, గత పదేళ్లుగా పెండింగ్లో ఉన్న ఈడీ మరియు సీబీఐ కేసుల తుది విచారణ ప్రక్రియ ఊపందుకునే అవకాశం ఉందని రాజకీయ, న్యాయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అటువైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా ఈడీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఇక ఆర్థిక నేరాలకు సంబంధించిన ఈ కేసుల్లో త్వరలోనే కీలక తీర్పులు వెలువడే అవకాశం ఉందనే చర్చ జరుగుతుండటంతో, ఏపీ రాజకీయాల్లో ఈ పరిణామం తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసుల్లో జగన్ ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న సంగతి తెలిసిందే.


