Tuesday, October 13, 2026 06:48 PM
Tuesday, October 13, 2026 06:48 PM

తెలంగాణ బీజేపీలో కాక్రోచ్ అలజడి..!

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనను కేంద్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా అణచివేయడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. త్వరలో జరగనున్న ఖైరతాబాద్ ఉప ఎన్నిక, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈ ఘటన తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు జెన్ జీ ఓటర్లను ఆకట్టుకోవడానికి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కాలేజీల్లో కాంక్లేవ్‌లను నిర్వహిస్తూ యువతకు దగ్గరవుతుంటే, మరోవైపు ఇలాంటి అరెస్టులు జరగడం యువతలో తీవ్ర ఆగ్రహాన్ని రాజేసింది. సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి.

Also Read : ఏపీలో మున్సిపల్ సమరానికి సై.. రేపే షెడ్యూల్ విడుదల..?

విమానాశ్రయంలోనే ముగ్గురు నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కుల హరణం అని సోషల్ మీడియాలో యువత మండిపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు నష్టనివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం రాష్ట్ర నాయకత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకం. గతంలో ఇదే స్థానం నుంచి ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో సగం మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉండగా, మిగిలిన సగం మంది నిరుద్యోగ యువత. జంతర్ మంతర్ ఘటన పట్ల నిరుద్యోగ యువతలో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చడం ఇప్పుడు బీజేపీకి పెద్ద సవాల్‌గా మారింది.

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లలో యాక్టివ్‌గా ఉండే ఈ జెన్ జీ ఓటర్లకు సరైన వివరణ ఇవ్వకపోతే ఓట్ల మీద తీవ్ర ప్రభావం పడుతుంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెబుతూనే మరోవైపు నిరసనలను అణచి వేయడం ద్వంద్వ ప్రమాణాలని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ విమర్శలను తిప్పికొట్టడానికి రాష్ట్ర నాయకులు ఒక ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేయాలి. లేదంటే పట్టభద్రుల ఓట్లు గంపగుత్తగా చేజారిపోయే ప్రమాదం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్ నియోజకవర్గానికి రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఇక్కడ అనేక ప్రైవేట్ సంస్థలు, కోచింగ్ సెంటర్లు ఉండటంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులు, చిరుద్యోగులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. ఖైరతాబాద్ బై పోల్‌లో గెలవాలంటే ఈ వర్గాల ఓట్లు చాలా కీలకం.

Also Read : విశాఖ మేయర్ రిజర్వేషన్ ఎవరికోసమో..?

జెన్ జీ ఓటర్లకు దగ్గరయ్యేందుకు దేశభక్తి గురించి మాట్లాడే నాయకులు, ఢిల్లీలో యువత గొంతును నొక్కడంపై స్పష్టత ఇవ్వాల్సిందే. సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించి యూత్‌ను కన్విన్స్ చేయాలని ప్రధాని మోడీ పదే పదే చెబుతున్నప్పటికీ, ఆచరణలో ఇలాంటి ఘటనలు పార్టీకి వ్యతిరేకంగా మారుతున్నాయి. అణచివేత ధోరణి కలిగిన పార్టీ అనే ముద్రను తొలగించుకోవడం ప్రస్తుత తరుణంలో అత్యంత కష్టమైన పని. ఖైరతాబాద్ బరిలో నిలవాలనుకునే అభ్యర్థులకు ఈ ఘటన పెద్ద పరీక్షగా మారింది. స్థానిక నాయకత్వం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిందే. తెలంగాణలో తాము బలపడుతున్నామని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నా రు. ఇప్పటికే తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారని గొప్పగా చెప్పుకుంటున్నారు.

కేంద్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి నెల సీనియర్ మంత్రులను రాష్ట్రానికి పంపిస్తున్నప్పటికీ, ఇలాంటి అనూహ్య ఘటనలు స్థానిక కేడర్‌కు ఇబ్బందికరంగా మారుతున్నాయి. రాష్ట్ర జనాభాలో యాభై శాతానికి పైగా యువత, ఫస్ట్ టైమ్ ఓటర్లే ఉన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాస్వామ్య నిరసన హక్కుల విషయంలో యువత చాలా స్పష్టంగా ఉన్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో సీజేపీ నేతలను అరెస్టు చేసిన తీరును యువత తీవ్రంగా ఖండిస్తుంది. ఈ పరిణామాలు పార్టీ ప్రచార రథచక్రాలకు అడ్డుతగిలే అవకాశం ఉంది కాబట్టి, కేంద్ర నాయకత్వం వెంటనే జోక్యం చేసుకుని నష్టనివారణ చర్యలు చేపట్టాలి. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, డిస్కార్డ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్లను విరివిగా వాడాలని ప్రధాని మోదీ హితబోధ చేసినా, గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉంటోంది.

Also Read : ఏపీ జడ్పీ ఛైర్మన్ రిజర్వేషన్లు ఇవేనా..?

జంతర్ మంతర్ నిరసనల అణచివేత ఉదంతం యూత్‌లో నెగెటివ్ క్రియేట్ చేసింది. యువతను ఆకర్షించేందుకు కాలేజీ కాంక్లేవ్లు ఎంత అవసరమో.. వారి ప్రజాస్వామ్య హక్కులను గౌరవించడం కూడా అంతే అవసరం. తెలంగాణ బీజేపీ భవిష్యత్తు పూర్తిగా యువత ఓట్ల మీదే ఆధారపడి ఉన్నందున.. ఈ సంకటం నుంచి బయటపడటానికి తక్షణ రోడ్ మ్యాప్ అవసరం. రాష్ట్ర నాయకత్వం కేవలం మాటలతో సరిపెట్టకుండా, యువత సమస్యలపై సానుకూలంగా స్పందించి వారి విశ్వాసాన్ని తిరిగి సంపాదించుకోవాలి. లేకపోతే రాబోయే జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ, ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సమర్థవంతమైన వ్యూహంతో ముందుకు వెళితేనే ఈ రాజకీయ సంక్షోభం నుంచి బీజేపీ గట్టెక్కగలదు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

వైసీపీని తుడిచేస్తున్న చిన్న...

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీకి...

విశాఖ మేయర్ రిజర్వేషన్...

బీజేపీ నేతల ఒత్తిళ్లతోనే విశాఖపట్నం నగర...

జగన్ ను భయపెడుతోన్న...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

ఏపీ జడ్పీ ఛైర్మన్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు...

మంగళగిరి మేయర్‌ పీఠం...

మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవి...

ఈడీ టార్గెట్ జగన్.....

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ...

పోల్స్