Monday, October 12, 2026 01:07 PM
Monday, October 12, 2026 01:07 PM

మేయర్ స్థానాల రిజర్వేషన్లు ఇవే..? మహిళలకు 50 శాతం కోటా..!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో పురపాలక శాఖ కీలక అడుగు వేసే అవకాశాలు కనపడుతున్నాయి. రాష్ట్రంలోని 17 కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీల రిజర్వేషన్లకు సంబంధించిన ప్రాథమిక కసరత్తును అధికారులు పూర్తి చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ప్రతిపాదనల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు ప్రస్తుతం అందుతున్న ముందస్తు సమాచారం ప్రకారం, రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకమైన మంగళగిరి–తాడేపల్లి మేయర్‌ స్థానాన్ని ఎస్టీ కేటగిరీకి కేటాయించే అవకాశం ఉంది.

Also Read : బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం..!

అలాగే కర్నూలు కార్పొరేషన్‌ను ఎస్సీ మహిళకు, రాజమహేంద్రవరంను ఎస్సీ జనరల్‌కు కేటాయించేలా ప్రాథమిక అంచనా వేశారు. కాకినాడ, మచిలీపట్నం మేయర్ స్థానాలను బీసీ మహిళలకు కేటాయించే వీలుండగా.. ఏలూరు, అనంతపురం, చిత్తూరు కార్పొరేషన్లను బీసీ జనరల్‌కు కేటాయించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇక గ్రేటర్ విశాఖ, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం, కడప నగరాల మేయర్‌ స్థానాలను జనరల్‌ మహిళలకు కేటాయించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

Also Read : వైసీపీ కుట్రలకు చంద్రబాబు చెక్‌.. BC లకే రికార్డు స్థానాలు

మరోవైపు 106 మున్సిపాలిటీల చైర్మన్ స్థానాలకు సంబంధించి బీసీలకు 36 స్థానాలు, ఎస్సీలకు 14 స్థానాలు, ఎస్టీలకు 3 స్థానాలు కేటాయించేలా అధికారులు ప్రాథమిక లెక్కలు వేశారు. ఇందులో భాగంగా చిలకలూరిపేట, గురజాల, నరసరావుపేట సహా పలు మున్సిపాలిటీలలో బీసీ మహిళలకు మేజర్ చాన్స్ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల సహా పలు కీలక మున్సిపాలిటీలను జనరల్‌ కేటగిరీ కింద ఉంచేందుకు అధికారులు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అయితే పురపాలక శాఖ సిద్ధం చేసిన ఈ స్థానాల కేటాయింపులన్నీ ప్రస్తుతం ప్రాథమిక కసరత్తు, అంతర్గత అంచనాల రూపంలో మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం దీనిపై సమీక్ష పూర్తి చేసి, రాష్ట్ర ఎన్నికల సంఘం భాగస్వామ్యంతో అధికారిక రిజర్వేషన్ల నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాతే ఈ స్థానాలపై పూర్తి స్థాయి తుది స్పష్టత రానుంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఏపీ లోకల్ పోరు.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు...

రాష్ట్రంలో కరువు ముప్పు.....

తెలంగాణలో రానున్న రోజుల్లో తీవ్ర నీటి...

ఎన్టీఆర్ కట్టించిన ఇల్లు.....

హైదరాబాద్ మహానగరంలో అత్యంత రద్దీగా ఉండే...

వైసీపీ కుట్రలకు చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కీలక ఘట్టం...

ఆధార్‌లో పేరు మార్చుకోవాలా?...

ఆధార్ కార్డులో పేరు సవరణ, మార్పులకు...

బ్రేకింగ్: రెండు రోజుల్లో...

దక్షిణాది రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న...

పోల్స్