Friday, October 9, 2026 08:09 PM
Friday, October 9, 2026 08:09 PM

3 జిల్లాలు.. 3 స్థానాలు.. 3 పార్టీలు..!

స్థానిక సంస్థల ఎన్నికల కోసం అధికార కూటమి పార్టీల నాయకత్వాలు, వాటాల కేటాయింపుల కోసం చర్చలు ప్రారంభించాయి. శాసనసభ ఎన్నికలు వేరు, ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలు వేరు అంటూ ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామని సంకేతాలు ఇచ్చిన జనసేన నాయకత్వం వెనక్కి తగ్గింది. చంద్రబాబును కలిసిన తర్వాత స్నేహపూర్వక పోటీలు ఉండొచ్చు అన్న పవన్ కళ్యాణ్.. ఏకాభిప్రాయానికి మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఒక వైపు సుప్రీంకోర్టు విచారణ, వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లు వంటి కీలక అంశాలు పెండింగ్‌లో ఉన్నా, ప్రధానంగా మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవుల పంపకానికి చర్చలు ప్రారంభమయ్యాయి.

Also Read : ఏపీలో స్థానిక ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్.. ఓటర్ల జాబితాపై కీలక ఆదేశాలు..!

ఉత్తరాంధ్రకు సంబంధించి, ఆయా పార్టీల అంతర్గత సమాచారం ప్రకారం పరిస్థితి ఆసక్తికరంగా మారింది. విశాఖపట్నం మేయర్ పదవి తమకు కేటాయించాలని బీజేపీ గట్టిగా కోరుతోంది. గతంలో, ఆ పార్టీకి విశాఖ బలమైన స్థానంగా ఉంది. ఈ ఒక్క మేయర్ పదవిని కేటాయిస్తే చాలు అని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యేలు లేని చోట మునిసిపల్ చైర్మన్ పదవులు కొన్ని అడగాలనేది బీజేపీ ఆలోచన. తమ ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట, మునిసిపల్ చైర్మన్ పదవులను జనసేన కోరుతోంది. ఉత్తరాంధ్రలో ఆరుగురు ఎమ్మెల్యేలు జనసేనకు ఉన్నారు. విశాఖను బీజేపీకి కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో, శ్రీకాకుళం లేదా విజయనగరం మేయర్ పదవి కోసం జనసేన పట్టుబడుతుంది.

Also Read : తాడేపల్లి ప్యాలెస్‌కు సజ్జల దూరం..? వైసీపి నేతలకు జగన్ కీలక ఆదేశాలు..!

ఉత్తరాంధ్రలో ఉన్నవి మూడే మేయర్ పదవులు. కాబట్టి కూటమిలోని మూడు పార్టీలు ఒక్కొక్కటి సర్దుకునే అవకాశాలు ఉన్నాయి. జనసేనకు ఉత్తరాంధ్రలో ఎమ్మెల్యేలు లేని జిల్లాలు అల్లూరి, శ్రీకాకుళం మాత్రమే. భవిష్యత్తులో ఈ జిల్లాల్లో బలపడటానికి వీలుగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో కూడా బలం పెంచుకోవాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది. ‘సుడా’ చైర్మన్ పదవి ఇచ్చినా, ఆయన పాలకొండకు చెందిన వారు. శ్రీకాకుళం జిల్లాలో చెప్పుకోదగిన అధికార పదవి జనసేనలో ఎవరికీ లేదు. శ్రీకాకుళం నగరంలో ప్రముఖ డాక్టర్ దానేటి శ్రీధర్ పేరు మాత్రమే వినిపిస్తుంది. ఆయన ఒక్కరే, ఇక్కడ పదివేల సభ్యత్వం చేర్పించి, బలమైన నాయకుడుగా ఉన్నారు. శ్రీకాకుళం మేయర్ టికెట్ ఇస్తే, పోటీ చేస్తానని, తనకు గల అనుకూల పరిస్థితులను, డాక్టర్ శ్రీధర్ పార్టీ నాయకత్వానికి ఇప్పటికే వివరించారు. టీడీపీకి చెందిన జిల్లా నాయకులు కూడా, వివిధ కారణాల వల్ల శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికలను తలనొప్పిగా భావిస్తున్నారు.

విజయనగరంలో అవనాపు కుటుంబం బలమైంది. అవనాపు సోదరులు చెరో పార్టీ లో ఉన్నారు. ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన చిన్న శ్రీను, తన తడాఖా చూపించడానికి విజయనగరం కార్పొరేషన్ ఎన్నికలను ఒక అవకాశంగా భావిస్తున్నారు. అందువల్ల, విజయనగరం మేయర్ పదవి ఆ జిల్లా టీడీపీ కోరుతోంది. మేయర్ ఇవ్వకపోతే శ్రీకాకుళం జిల్లాలో పలాస లేదా ఇచ్చాపురం మున్సిపాలిటీ చైర్మన్ పదవులను జనసేన డిమాండ్ చేసే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

గెలుపు కాదు.. ఓట్లు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీల సందడి...

మందులకు లొంగని మలేరియాకు...

వైద్య రంగంలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ...

బ్రేకింగ్: రేపు ఏపీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల...

ఏపీలో స్థానిక ఎన్నికలకు...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు...

తాడేపల్లి ప్యాలెస్‌కు సజ్జల...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల్లో...

హౌతీల ఎఫెక్ట్.. భారత్‌లో...

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి....

పోల్స్