Thursday, September 3, 2026 03:31 PM
Thursday, September 3, 2026 03:31 PM

భయం భయంగా జెన్ జీ.. పాపం యువత..!

విమర్శలకు గురవుతామనే భయంలో, జెన్ జీ నిపుణులు కెరీర్ అవకాశాలు కోల్పోతున్నారని లింక్డ్ ఇన్ నివేదిక తాజాగా వెల్లడించింది. జెడ్జ్ చేస్తారేమోననే భయంతో, తమ కెరీర్ ఎదుగుదలకు సహాయపడే వ్యక్తులతో సంబంధాలు ఏర్పరుచుకోవడానికి లేదా పరిచయాలు పెంచుకోవడానికి చాలా మంది జెన్ జీ నిపుణులు వెనకడుగు వేస్తున్నారని పేర్కొంది. ముఖ్యంగా భారతదేశానికి చెందిన జెన్ జీ నిపుణులు నిరంతరం ఆన్‌లైన్ ప్రపంచంలోనే ఉంటున్నారు. కానీ వారి కెరీర్‌కు ఉపయోగపడే వ్యక్తులతో మాట్లాడడానికి, లేదా నెట్‌వర్కింగ్ చేయడానికి 83 శాతం మంది వెనకాడుతున్నారని లింక్డ్ ఇన్ నివేదిక స్పష్టం చేసింది. లింక్డ్ ఇన్ రిపోర్టు ప్రకారం, “ఇతరులు తమను తప్పుగా అంచనా వేస్తారనే భయం 44 శాతం మందిలో ఉండగా, ఇతరులను ఇబ్బంది పెడుతున్నామనే ఆందోళనలో 39 శాతం ఉన్నారు. తాము నిజాయితీగా మాట్లాడడం లేదని ఇతరులు అనుకుంటారోమోనని 37 శాతం మంది అనుకుంటున్నారు. అందువల్ల జెన్ జీ యువత విలువైన సలహాలు పొందలేకపోతున్నారు. కొత్త పరిచయాలు చేసుకోలేక, మంచి అవకాశాలు అందుకోలేకపోతున్నారు.”

Also Read : ఢిల్లీలో మంతనాలు.. తెలంగాణ కాంగ్రెస్‌లో గుబులు..!

లింక్డ్ ఇన్ కోసం సెన్సెస్ వైడ్ అనే సంస్థ ఈ 2026 జులై 20 నుంచి ఆగస్టు 11 మధ్య ఒక సర్వే నిర్వహించింది. భారత్, యూకే, యూఎస్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, సింగపూర్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, యూఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాల్లో ఈ సర్వే చేపట్టింది. ఈ దేశాల్లో ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ పని చేసే 18 నుంచి 80 ఏళ్ల వయస్సు గల 18,050 మంది స్పందనలను తీసుకుని నివేదిక రూపొందించింది.

ఈ నివేదిక ప్రకారం, 79 శాతం మంది భారత జెన్ జీ యువతకు వృత్తిపరమైన సంబంధాలు చాలా ముఖ్యమని తెలుసు. అయినప్పటికీ సగం మందికి పైగా.. అంటే 52 శాతం మంది వాటిని ఎలా ప్రారంభించాలో తెలియక సతమతం అవుతున్నారు. అలాగే 53 శాతం మంది తమ పరిచయాలను నిజమైన సంబంధాలుగా మార్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. పైగా అందుకు అయ్యే ఖర్చుల గురించి ఆందోళన చెందుతున్నారు. లింక్డ్ ఇన్ డేటా ప్రకారం, భారతదేశంలో కంపెనీలో అంతర్గత పరిచయాలు ఉన్న వ్యక్తులకు, అలాంటి పరిచయాలు లేని వారితో పోలిస్తే దాదాపు 8.5 రెట్లు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంది. అయితే వృత్తిపరమైన సంబంధాలను ఎలా నిర్మించుకోవాలో, తమకు ఎవరూ స్పష్టంగా చెప్పడం లేదని ప్రతి ఐదుగురిలో ముగ్గురు జెన్ జీ యువత చెబుతున్నారు.

Also Read : భూమికి రెడ్ అలెర్ట్.. మరో రెండేళ్ళలో పరిస్థితి దారుణం..!

చాలా మంది ఈ విషయంతో తమకు పెద్దగా మార్గదర్శకత్వం లభించడం లేదని, తమంతట తామే నేర్చుకోవాల్సి వస్తోందని చెప్పారు. దీని వల్ల ఎవరిని, ఎప్పుడు, ఎలా సంప్రదించాలి..? ఏం మాట్లాడాలి అనేది తెలుసుకోవడం చాలా కష్టంగా మారుతోందని యువత అభిప్రాయపడుతున్నారు. జెన్ జీ యువత ఇతరులను సంప్రదించడానికి సంకోచిస్తున్నప్పటికీ, మెజారిటీ మిలీనియల్స్.. 92
శాతం, జెన్ ఎక్స్ నిపుణులు.. 95 శాతం తమకు తెలియని వారైనా సరే, కెరీర్ ప్రారంభంలో ఉన్నవారికి సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. “ఇప్పుడు ఉద్యోగాలు మారుతున్నాయి. కెరీర్ మార్గాలు కూడా ఒకేలా సరళంగా ఉండడం లేదు. ఇలాంటి సమయంలో కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం ఎంత ముఖ్యమో, సమాజంలో ఇతరులతో మంచి పరిచయాలు పెంచుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే నెట్‌వర్కింగ్ పెంచుకోవడం అనగానే ఎవరో తెలియని వారితో పరిచయాలు పెంచుకోవడం, లేదా ఇబ్బందిగా మాట్లాడడం కాదు. చిన్న చిన్న మాటలే కాలక్రమేణా మీపై నమ్మకాన్ని పెంచుతాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

హీరోయిన్ కేసు క్లోజ్...

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ముంబై మోడల్...

అక్టోబర్‌లోనే స్థానిక పోరు.....

అమరావతి వేదికగా తెలుగుదేశం పార్టీ జాతీయ...

ఎవడు డ్రామాలు ఆడుతున్నాడో...

చిత్తూరు జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి...

రాజీనామా చేయండి.. కొండాకు...

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత వేగంగా మారుతున్న...

రాపిడో, ఓలా, ఉబర్‌ల...

హైదరాబాద్ జంటనగరాల పరిధిలో రాత్రి వేళల్లో...

ఢిల్లీలో మంతనాలు.. తెలంగాణ...

తెలంగాణ కాంగ్రెస్ ఒక్కసారిగా రాజకీయ ఉత్కంఠ...

పోల్స్