Wednesday, September 2, 2026 10:21 AM
Wednesday, September 2, 2026 10:21 AM

కేఏ పాల్ ని కదిపి బొత్స పరువు పోగొట్టుకున్నాడా?

అరేయ్ నత్తోడా… రారా చూసుకుందాం.. అంటూ కేఏ పాల్ ఊగిపోయారు. తన పేరును బొత్స సత్తిబాబు.. అనవసరంగా ఈ వివాదంలోకి లాగడంపై కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్స సత్యనారాయణను లక్ష్యంగా చేసుకుని అత్యంత ఘాటైన వ్యాఖ్యలతో ఆయన విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి, శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయాలను వేడెక్కించాయి. గతం మర్చిపోయి బొత్స పిచ్చికుక్క కరిచినట్లు ప్రవర్తిస్తున్నారంటూ తీవ్ర పదజాలంతో నిప్పులు చెరిగారు.

Also Read : ఏపీ సర్కార్ సంచలనం.. అంబులెన్స్ సేవల్లో క్వాంటమ్ విప్లవం..!

ఇటీవల వైఎస్సార్‌సీపీలో జరిగిన అంతర్గత పరిణామాలపై బొత్స స్పందిస్తూ, విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టే క్రమంలో ఆయనను కేఏ పాల్‌తో పోల్చారు. ఒకప్పుడు కేఏపాల్ ఉండేవారు.. ఇప్పుడు విజయసాయిరెడ్డి తయారయ్యారంటూ బొత్స కామెంట్ చేయడంతో కేఏపాల్ కి బాగా మండింది. దీంతో బొత్సకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ కౌంటర్ ఇచ్చారు. గతంలో లక్షల మంది ప్రజల ఎదుట బొత్స సత్యనారాయణ నా కాళ్ల వద్ద కూర్చుని, తనను గెలిపించమని వేడుకున్న విషయం మర్చిపోయాడా?”అని ప్రశ్నించారు. బొత్సకు సరిగ్గా మాట్లాడటం కూడా రాదని నత్తోడు అంటూ విమర్శించారు. అలాంటి వ్యక్తి అసలు మంత్రి ఎలా అయ్యాడో అర్థం కావడం లేదన్నారు.

Also Read : నెట్టింట వెలిగొండ డామినేషన్.. టాప్ ట్రెండింగ్‌లో ప్రాజెక్టు ప్రారంభోత్సవం..!

తాను ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ యుద్ధాలను ఆపడంలో, ప్రపంచ శాంతి కోసం బిజీగా ఉంటే, తనతో పోలుస్తూ మాట్లాడాల్సిన అవసరం బొత్సకు ఏముందని నిలదీశారు. తనను కించపరిచేలా మాట్లాడినందుకు బొత్స సత్యనారాయణ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో ఆయనకు డిపాజిట్లు కూడా దక్కవని, ప్రజా కోర్టులో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. తన జోలికి వస్తే ఊరుకునేది లేదని తీవ్ర స్వరంతో మండిపడ్డారు. బొత్సపై కేఏ పాల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Also Read : అవును సజ్జల కొట్టాడు.. కోటంరెడ్డి సంచలనం..!

ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే తీవ్ర పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రజల సొమ్మును దోచుకునే దొంగలకు ఓట్లు వేసిన వాళ్లు నష్టపోతారని, భవిష్యత్తులో అలాంటి నాయకులకు ఓట్లు వేయవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. కేఏ పాల్ ని కదిపి బొత్స తన పరువు తానే పోగొట్టుకున్నాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బొత్స సత్యనారాయణ చేసిన చిన్న వ్యాఖ్యకు కేఏ పాల్ తనదైన శైలిలో అత్యంత తీవ్రంగా, కామెడీ మరియు పొలిటికల్ పంచ్‌లతో కౌంటర్ ఇవ్వడంతో, ఈ ఇద్దరి మధ్య నడుస్తున్న ఈ ‘హీటెడ్ ఫైట్’ పై నెటిజన్లు రకరకాల మీమ్స్, ట్రోల్స్‌తో సోషల్ మీడియాని ఊపేస్తున్నారు.

-జి.సత్యనారాయణరాజు

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వెలిగొండ.. నీటి పంపకాల...

30 ఏళ్ల కల సాకారమైంది. శ్రీశైలం...

హిట్ అండ్ రన్.....

హైదరాబాద్‌లో మరో హిట్ అండ్ రన్...

చరిత్ర సృష్టించబోతున్న ఉత్తరాంధ్ర.....

ఉత్తరాంధ్ర రైతాంగ దశాబ్దాల కల నెరవేరబోతోంది....

అవును సజ్జల కొట్టాడు.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

నెట్టింట వెలిగొండ డామినేషన్.....

ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల దశాబ్దాల...

సీమ పల్లెలపై పవన్...

రాయలసీమ ప్రాంత సమగ్ర రూపురేఖలను మార్చేలా,...

పోల్స్