Wednesday, October 14, 2026 03:03 AM
Wednesday, October 14, 2026 03:03 AM

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్‌గా తెలుగు ఐఏఎస్..!

దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక విద్యా ప్రవేశ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్‌గా ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి వి. ప్రసన్న వెంకటేష్ నియమితులయ్యారు. నీట్ పేపర్ వ్యవహారంలో తీవ్ర విమర్శలు వచ్చిన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉన్నత విద్యా శాఖ సిఫార్సుల మేరకు ఆయనను ఈ కీలక పదవికి ఎంపిక చేస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read : వాళ్ళందరూ భారతీయులే.. నేపాల్ సంచలన ప్రకటన..!

జాతీయ స్థాయిలో విద్యా రంగంలో అత్యంత కీలకమైన ఎన్‌టీఏ పారదర్శకతను, నిర్వహణ తీరును మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం ఈ అడుగు వేసింది. వి. ప్రసన్న వెంకటేష్ 2012 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిగా పరిపాలనా రంగంలో తనదైన ముద్ర వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ జిల్లాల కలెక్టర్‌గా, మున్సిపల్ కమిషనర్‌గా మరియు విద్యాసంస్థల పర్యవేక్షణ విభాగాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది.

Also Read : అదిరిపోయే రేంజ్‌తో సుజుకి తొలి ఎలక్ట్రిక్ ‘కే’ కారు..!

క్షేత్రస్థాయిలో ఆయన చూపిన ప్రతిభ, సంస్కరణల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత పరీక్షల నిర్వహణ సంస్థ అయిన ఎన్‌టీఏ బాధ్యతలను ఆయనకు అప్పగించింది. కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ‘సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్’ కింద ప్రసన్న వెంకటేష్ ఈ డైరెక్టర్ పదవిలో ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్, జేఈఈ, నెట్ వంటి మెగా ప్రవేశ పరీక్షలను పకడ్బందీగా, ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించడమే ఇప్పుడు ఆయన ముందున్న ప్రధాన లక్ష్యం.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

వైసీపీని తుడిచేస్తున్న చిన్న...

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీకి...

తెలంగాణ బీజేపీలో కాక్రోచ్...

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్...

విశాఖ మేయర్ రిజర్వేషన్...

బీజేపీ నేతల ఒత్తిళ్లతోనే విశాఖపట్నం నగర...

జగన్ ను భయపెడుతోన్న...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

ఏపీ జడ్పీ ఛైర్మన్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు...

మంగళగిరి మేయర్‌ పీఠం...

మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవి...

పోల్స్