Tuesday, October 21, 2025 07:31 PM
Tuesday, October 21, 2025 07:31 PM
roots

ఎయిర్ పోర్ట్ లో ల్యాప్ టాప్ ఎందుకు చెక్ చేస్తారు..? షాకింగ్ నిజాలు ఇవే..!

ఫ్లైట్ జర్నీ అనగానే కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. భద్రతా కారణాలతో విమానాశ్రయాల్లో అధికారులు చుక్కలు చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా క్యాబిన్ బ్యాగేజ్ విషయంలో ప్రతీ ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు. బ్యాగ్ లో ఉన్న అన్ని వస్తువులను తీసి ఓ ట్రే లో ఉంచాల్సి ఉంటుంది. మీరు సరిగ్గా ప్యాక్ చేసిన బ్యాగ్‌ను అపరిచితుల ముందు విప్పి, మళ్ళీ ప్యాక్ చేయాలి. ఇది కాస్త చికాకుగా అనిపిస్తుంది. కానీ విమానాశ్రయాల్లో భద్రతా సిబ్బంది ఇలా చెక్ చేయడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి.

Also Read : ఏపిలో గూగుల్ డేటా సెంటర్ ముహుర్తం ఫిక్స్..!

బ్యాగ్ లోపల, ల్యాప్‌ టాప్ అనేది ఎక్స్-రే స్క్రీన్‌ పై ఒక పెద్ద గోడలా అడ్డు పడుతూ ఉంటుంది. దాని దట్టమైన బ్యాటరీ, మెటల్ కేసింగ్ చార్జర్‌ లు, పెన్నులు లేదా నాణేలు వంటి చిన్న వస్తువులను దాచే విధంగా నీడలను క్రియేట్ చేస్తాయి. చెకింగ్ లో అవి అనుమానాస్పదంగా ఉంటాయి. అందుకే ల్యాప్ టాప్ బయటకు తీస్తే, క్లియర్ గా ఏం ఉందో చూడవచ్చు. ల్యాప్‌ టాప్‌ లలో లిథియం-అయాన్ బ్యాటరీలను వాడతారు. ఇవి శక్తివంతమైనవి మాత్రమే కాకుండా సున్నితమైనవి కూడా. బ్యాగ్ లో స్క్రీనింగ్ సమయంలో హీట్ ఎక్కే అవకాశం ఉంటుంది.

Also Read : లిక్కర్ కేసులో ఈడీ ఎంట్రీ.. ఆ నలుగురి అరెస్ట్ పక్కా..?

అలాగే స్మగ్లర్లు ల్యాప్‌ టాప్‌ లలో వస్తువులను దాచడానికి ప్రయత్నం చేయడం కూడా చెకింగ్ కు ఓ కారణం. బంగారం వంటి విలువైన ఖనిజాలను దాస్తూ ఉంటారు. ల్యాప్‌టాప్‌లను దుర్వినియోగం చేసిన సందర్భాలు ఉన్నాయి. స్మగ్లర్లు మాదకద్రవ్యాలు లేదా ప్రమాదకరమైన వస్తువులను దాచడానికి కేసింగ్‌ లను ఖాళీ చేస్తూ ఉంటారు. లేదా లోపలి పార్ట్ లను మార్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, 2022లో, వర్జీనియాలోని రిచ్‌ మండ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాప్‌ టాప్ కేసింగ్‌ లో దాచిన డబుల్ బ్లేడ్ కత్తిని చెకింగ్ లో గుర్తించారు. అప్పటి నుంచి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ల్యాప్ టాప్ బయటకు తీయడం అనేది తప్పనిసరిగా మారింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఆ పదవులు ఎప్పుడు...

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే...

వాళ్ళను వదలొద్దు.. చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర...

ఉప్పు, పప్పు కూడా...

ఇద్దరు అధికారులు తన్నుకుంటే.. అది ఏమవుతుందో...

చంద్రబాబు ధైర్యానికి ఫిదా.....

సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు...

భారతీయ విద్యార్ధులకు ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే...

కొండా వివాదం సద్ధుమణిగినట్లేనా..?

తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం కాంగ్రెస్...

పోల్స్