Friday, September 12, 2025 06:24 AM
Friday, September 12, 2025 06:24 AM
roots

ఈరోజు (01-09-2025) రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయణం వర్ష ఋతువు, శుక్లపక్షం 01-09-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి.

మేషం 01-09-2025

కార్యాలయంలో కొత్త మార్పులు ఎదురుకావచ్చు. సహోద్యోగులు కొంత అసహకారం చూపినా, మీ దైర్యం, పట్టుదల వల్ల పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఒక చిన్న లాభం దక్కుతుంది. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి కలహాలు వచ్చినా మీరు ఓపికగా వ్యవహరిస్తే పరిష్కారం వస్తుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

—————————————

వృషభం 01-09-2025

ఈ రోజు మీకు ఆర్థిక విషయాల్లో శుభవార్తలు వింటారు. మీరు ప్రారంభించిన పనుల్లో ఒకదానిలో ఊహించని లాభం దక్కుతుంది. స్నేహితులతో కలసి కొత్త పనుల మీద చర్చలు చేస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. కొత్త పరిచయాలు లాభదాయకం అవుతాయి.

—————————————

మిధునం 01-09-2025

ఉద్యోగ సంబంధంగా ఒక కొత్త బాధ్యత మీపై పడుతుంది. మీ సామర్థ్యాన్ని గుర్తించి పెద్దలు ప్రోత్సహిస్తారు. గౌరవం పెరుగుతుంది. వాణిజ్యంలో ఉన్నవారికి కాస్త జాగ్రత్త అవసరం కానీ, చివరికి లాభమే ఉంటుంది. మీ ప్రయత్నాలకు ఫలితం లభిస్తుంది.

—————————————

కర్కాటకం 01-09-2025

ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అనుకోని ఆర్థిక వ్యయాలు తలెత్తుతాయి. కుటుంబంలో ఒక సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. దూర ప్రయాణం అనుకూలంగా ఉంటాయి. స్నేహితుల సహాయం లభిస్తుంది. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం.

—————————————

సింహం 01-09-2025

మీ ఆత్మవిశ్వాసం పెరిగి ముందడుగు వేస్తారు. వృత్తి పరంగా మంచి పురోగతి ఉంటుంది. పాత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక లాభం పొందుతారు. గౌరవం పెరుగుతుంది. ఒక శుభవార్త వినే అవకాశం ఉంది.

—————————————

కన్య 01-09-2025

ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. మాటలలో జాగ్రత్త వహించండి. పాత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కొంతమంది స్నేహితుల వల్ల లాభం కలుగుతుంది. జాగ్రత్తగా ఉంటే అన్ని పనులు సాఫీగా పూర్తవుతాయి.

—————————————

తుల 01-09-2025

నూతన స్నేహితులు ఏర్పడతారు. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు ప్రారంభించే పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంట్లో సంతోషం నెలకొంటుంది. ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. మీ ప్రతిభ గుర్తింపు పొందుతారు.

—————————————

వృశ్చికం 01-09-2025

నూతన వ్యాపారంలో లాభం కలుగుతుంది. స్నేహితుల సహకారం మీకు ఉపశమనాన్ని ఇస్తుంది. కుటుంబ పెద్దల సలహలు కలసివస్తాయి. మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది.

—————————————

ధనస్సు 01-09-2025

విద్యార్థులకు విజయాలు దక్కుతాయి. మీ ప్రతిభకు మంచి గుర్తింపు వస్తుంది. మీరు ప్రయత్నిస్తున్న ఒక పని గూర్చి మంచి వార్త వినే అవకాశం ఉంది. దూర ప్రయాణ యోగం ఉంది. భవిష్యత్తు ప్రణాళికలు చేసుకునే సమయం ఇది.

—————————————

మకరం 01-09-2025

ఈ రోజు కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఒక శుభవార్త మీ మనసుకు సంతోషం కలిగిస్తుంది. ఆర్థికంగా మెరుగుదల ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపార విషయాలలో ఊహించని లాభాలు అందుకుంటారు.

—————————————

కుంభం 01-09-2025

ఈ రోజు పనులలో ఆలస్యం తలెత్తుతుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. సహనంతో ఉండటం చాలా అవసరం. తొందరపడటం వలన సమస్యలు మరింత పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలలో ఆసక్తి పెరుగుతుంది.

—————————————

మీనం 01-09-2025

మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి సంబంధంగా మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక లాభం ఉంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అన్ని వ్యవహారలలో స్నేహితుల సహకారం లభిస్తుంది. గృహమున శుభవార్తవినే అవకాశం ఉంది.

—————————————

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్