Monday, October 27, 2025 10:30 PM
Monday, October 27, 2025 10:30 PM
roots

కేసీఆర్ కోసమే బీజేపీ నిర్ణయమా..?

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విషయంలో బీజేపీ అధిష్టానం ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో ఎన్నో పేర్లు వినబడిన సరే ఎవరు ఊహించని విధంగా.. రామచంద్రరావును రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. బలమైన నాయకులు ఉన్నా సరే ఆయనను ఎంపిక చేయటంతో పార్టీ కార్యకర్తలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చాలామంది కార్యకర్తలకు ఆయన ఎవరో కూడా తెలియదు. నాయకులకు సైతం రామచంద్రరావు విషయంలో క్లారిటీ లేదు.

Also Read : మహా న్యూస్ పై దాడి వెనుక వైసీపీ హస్తం..?

మీడియాలో అప్పుడప్పుడు కనబడటమే మినహా ఆయన పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనలేదనే చెప్పాలి. అలాంటి వ్యక్తిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేయడం విషయంలో బిజెపి వ్యూహం ఏంటి అనేది ఎవరికి అర్థం కాలేదు. పెద్దగా మీడియా సమావేశాల్లో కూడా ఆయన ప్రత్యర్థులపై విమర్శలు చేసిన సందర్భాలు కూడా తక్కువే. అయితే దీనిపై.. కాంగ్రెస్ పార్టీ బిజెపి విషయంలో తీవ్ర ఆరోపణలు చేస్తుంది. కెసిఆర్ ను సంప్రదించిన తర్వాతే రామచంద్రరావును రాష్ట్ర అధ్యక్షుడిగా బిజెపి అధిష్టానం ఎంపిక చేసిందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

Also Read : మళ్లీ అదే పాట.. అదే మాట.. మార్పు రాలేదా..?

ముందు నుంచి కెసిఆర్ కు ఇబ్బందులు లేకుండా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి వారు వ్యవహరించారని.. చాలామంది బిజెపి నేతలకు కూడా ఈ విషయంలో క్లారిటీ లేదని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు హడావిడి చేస్తున్నాయి. కెసిఆర్ తో బీజేపీ అధిష్టానం లాలూచీ పడిందని అందుకే.. కెసిఆర్ అండ్ కో అవినీతి అక్రమాలకు పాల్పడిన సరే వాటి విషయంలో చర్యలు తీసుకునేందుకు ముందుకు అడుగు వేయడం లేదని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. ధర్మపురి అరవింద్, సోయం బాబూరావు వంటి నాయకులు ఉన్నా సరే వాళ్ళ విషయంలో బిజెపి అధిష్టానం ఆసక్తి చూపలేదని.. భారత రాష్ట్ర సమితిని ఇబ్బంది పెట్టకుండా ఉండే నాయకుల వైఫై ఆసక్తి చూపిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్