టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి ఒక శుభవార్త చెప్పింది.. ప్రముఖ భారతీయ ఫార్మా కంపెనీ జైడస్ లైఫ్‌సైన్సెస్. ఈ సంస్థ తయారు చేసిన దపాగ్లిఫ్లోజిన్ జనరిక్ టాబ్లెట్లకు అమెరికా డ్రగ్ రెగ్యులేటర్ ఆమోదం లభించింది. ఈ మందు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేయడమే కాకుండా, గుండె సంబంధిత సమస్యల ముప్పును తగ్గించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ దపాగ్లిఫ్లోజిన్ టాబ్లెట్లు శరీరంలో ‘SGLT2 ఇన్హిబిటర్స్’గా పనిచేస్తాయి. సాధారణంగా మన మూత్రపిండాలు రక్తంలోని గ్లూకోజ్ ను మళ్ళీ శరీరంలోకి పంపిస్తాయి.
Also Read : బుమ్రాకే చుక్కలు చూపించిన 15 ఏళ్ల కుర్రాడు..!
అయితే, ఈ మందు ఆ ప్రక్రియను అడ్డుకుని, శరీరంలో ఉన్న అదనపు చక్కెరను మూత్రం ద్వారా బయటకు పంపివేస్తుంది. దీనివల్ల ఇన్సులిన్ తో పనిలేకుండానే రక్తంలో చక్కెర లెవెల్స్ చాలా వేగంగా కంట్రోల్ అవుతాయి. ఈ మందు కేవలం డయాబెటిస్‌కే పరిమితం కాకుండా, గుండెకు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అలాంటి వారికి ఈ మందు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.
Also Read : పుకార్లకు చెక్.. కేరళలో తారక్ కలరిపట్టు వేట..!
అంతేకాకుండా, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు ఉన్న రోగులకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. అమెరికా మార్కెట్లో జనరిక్ వెర్షన్‌కు అనుమతి లభించడం వల్ల, ఈ మందు తక్కువ ధరకే సామాన్యులకు అందుబాటులోకి రానుంది. బరువు తగ్గడానికి, రక్తపోటును క్రమబద్ధీకరించడానికి కూడా ఈ మందు సహాయపడుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. జైడస్ సంస్థకు లభించిన ఈ ఆమోదం అంతర్జాతీయ ఫార్మా రంగంలో భారతీయ కంపెనీల ముద్రను మరోసారి చాటిచెప్పింది.

