దాదాపు ఏడాదికాలంగా తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం ఏ స్థాయిలో సంచలనమైందో అందరికీ తెలిసిందే. అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుమలలో జంతువుల కొవ్వుతో తయారుచేసిన నెయ్యిని వినియోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యల తర్వాత దేశవ్యాప్తంగా అప్పటి ప్రభుత్వం పై విమర్శలు వచ్చాయి. పలు రాష్ట్రాల్లో హిందుత్వవాదులు కేసులు కూడా నమోదు చేశారు. ఇక దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసి విచారణ మొదలుపెట్టింది.
Also Read: అయ్యో పాపం.. పరిస్థితి మరీ ఇంత దారుణమా..!
అయితే ఈ వ్యవహారం ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లడంతో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వo ఏర్పాటు చేసిన దర్యాప్తు బృందాన్ని రద్దుచేసి.. సిబిఐ అధికారులతో కలిపి కొంతమంది ఐపీఎస్ లను కూడా విచారణ బృందంలో చేరుస్తూ సిట్ ఏర్పాటు చేసింది. నందిని ఈయన కాదని ఏఆర్ డైరీ నెయ్యి ఏ విధంగా తీసుకున్నారు అనే కోణంలో సీట్ విచారణ జరుపుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. టిటిడి మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పిఎ కడూరు చిన్నప్పన్నను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read: స్పిరిట్ కోసం ప్రభాస్ కొత్త లుక్.. వేరే లెవెల్ ప్లాన్..!
ఇప్పటికే పలువురుని విచారించిన అధికారులు బుధవారం అప్పన్నను విచారించగా సరైన సమాధానాలు చెప్పలేదని.. విచారణకు సహకరించలేదని పేర్కొంటూ అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన తొలి రాజకీయ అరెస్టు ఇదే కావడం గమనార్హం. ఇక అప్పన్న ఎవరి ఆదేశాలతో ఈ వ్యవహారంలో తల దూర్చాడు అనే కోణంలో అధికారులు విచారణ మొదలుపెట్టారు. అప్పన్న ఢిల్లీలో ఏపీ భవన్ కు ప్రోటోకాల్ ఓఎస్డిగా కూడా వ్యవహరించారు. అతన్ని నెల్లూరు ఏసీబీ కోర్టు లో హాజరు పరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కాగా సిట్ విచారణ తప్పుబడుతూ అప్పన్న హైకోర్టు కు కూడా వెళ్లడం గమనార్హం. అయితే ఢిల్లీలో అతనితో సహకరించిన వాళ్ళు ఎవరనే అంశాలను కూడా సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ కేసులో వైవి సుబ్బారెడ్డిని కూడా విచారించే అవకాశాలు కనబడుతున్నాయి.

