Friday, September 12, 2025 05:23 PM
Friday, September 12, 2025 05:23 PM
roots

బూ*తులు తిడుతూ నీతులు చెప్పడం వైసీపీ కే సాధ్యం..!

నీతులు చెప్పడంలో వైసీపీ ఎప్పుడు ముందుంటుంది.. చేసే పనులకు చెప్పే మాటలకు పొంతన ఉండదు అనే విషయంలో వైసిపి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ప్రస్తుతం జరుగుతున్న అరెస్టు వ్యవహారాలను పదేపదే తమ అధికారిక పత్రికలో వ్యతిరేకిస్తున్న వైసిపి.. గతంలో జరిగిన కొన్ని అరెస్టుల విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలుసినా.. తాము తప్పు చేయలేదని, ప్రస్తుత ప్రభుత్వమే అరెస్టులతో తప్పులు చేస్తోందంటూ చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అప్పట్లో అచ్చేన్నాయుడు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా ఆయన కనీసం కూర్చోలేని పరిస్థితి ఉన్నా సరే శ్రీకాకుళంలో అరెస్టు చేసి ఆయనను రోడ్డు మార్గంలో విజయవాడ తీసుకొచ్చారు.

Also Read : జగన్ పైశాచిన ఆనందం కోసమే వారు బలయ్యారు..!

ఇక టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు విషయంలో కూడా ఇలాగే జరిగింది. అయ్యన్నపాత్రుడుని అర్ధరాత్రి పోలీసుల గోడలు దూకి అరెస్టు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక గన్నవరం పార్టీ ఆఫీస్ పై దాడి జరిగిన తర్వాత వ్యతిరేకించిన వాళ్ళను ఆడాళ్లు అని కూడా చూడకుండా పోలీసులు బెడ్ రూమ్ లోకి వెళ్లి అరెస్టు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక రఘురామకృష్ణం రాజుని తన పుట్టినరోజు నాడే విజయవాడ తీసుకొచ్చి పోలీసులు కష్టడీలో టార్చర్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే సాక్షాలను కూడా రఘురామకృష్ణంరాజు సమర్పించారు.

Also Read : పోసాని తర్వాత టార్గెట్ వీరేనా..?

టార్చర్ జరిగింది అనేది నిర్ధారణ అయింది. ఇక పోసాని మాట్లాడిన మాటలను సాధారణ వ్యాఖ్యలుగా వైసిపి మీడియా చెప్పే ప్రయత్నం చేస్తోంది. పోసాని ఏ స్థాయిలో బూతులు మాట్లాడారో అందరికీ గుర్తుంది. అలాగే వల్లభనేని వంశీ విషయంలో కూడా ఇలాగే ప్రేమ చూపించింది. వంశీ మాట్లాడిన మాటలను అదే వైసీపీ పెద్దలపై మాట్లాడి ఉంటే వాళ్ళు ఇలాగే స్పందించేవారా అనే ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో వినపడుతున్నాయి.

Also Read : పోసాని రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు

ఇక బోరుగడ్డ అనిల్ కుమార్ తో పాటుగా బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ విషయంలో కూడా వైసిపి ఇలాంటి సానుకూల వ్యాఖ్యలే చేస్తోంది. వాళ్ళు ఏం చేశారు అనేదానిపై పోలీసులు పక్క ఆధారాలతో ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా చాలా ఆధారాలు కనపడుతున్నాయి. అందుకే న్యాయస్థానాలు కూడా వాళ్లకు బెయిల్ ఇచ్చే విషయంలో వెనకడుగు వేసాయి. గత చరిత్రను మర్చిపోయి వైసిపి సోషల్ మీడియా గానీ వైసీపీ అనుకూల ఎలక్ట్రానిక్ మీడియా గానీ నీతులు చెప్పటం మాత్రం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్