Sunday, March 22, 2026 03:34 AM
Sunday, March 22, 2026 03:34 AM

శ్రీవారితో ఆటలు.. వైసీపీ నేతపై గురి..?

దేవుడితో ఆటలు ఆడటంతో వైసీపీ అధిష్టానం, ఆ పార్టీ కార్యకర్తలు ముందు ఉంటారు అనే విషయం ఎన్నో సందర్భాల్లో స్పష్టత వచ్చింది. ఎన్ని విమర్శలు వచ్చినా సరే పింక్ డైమండ్ నుంచి ఎన్నో ఆధారాలు లేని ఆరోపణలను వైసీపీ చేసే ప్రయత్నం చేసింది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ ఆడిన డ్రామాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదే పదే తిరుమలను వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చేశారు. ఇక ఇప్పుడు తిరుమలలో మద్యం అంటూ వైసీపీ డ్రామాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

Also Read : భూములను లాక్కోలేరు… రికార్డులు తారుమారు చేయలేరు

సాధారణంగా తిరుమలకు మద్యం అనుమతి ఉండదు. కానీ తిరుమలలో కాళీ మద్యం బాటిల్స్ ఉంచి సాక్షిలో ప్రసారాలు చేశారు. దీని వెనుక మాజీ ఎమ్మెల్యే భూమన అనుచరుడు, సాక్షి విలేఖరి సహా పలువురిని అదుపులోకి తీసుకుంది పోలీసు శాఖ. ఇక దీనిపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కల్తీ నెయ్యితో భక్తుల మనోభావాలు దెబ్బ తీసిన వైసీపీ.. తిరుమల శ్రీవారి ఆలయంపై వైసీపీ కుట్రలు చేయడాన్ని సీరియస్ గా తీసుకున్నారు.

Also Read : మంచి జరుగుతుంటే తట్టుకోలేక కుట్రలు

టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారనేది స్పష్టంగా అర్ధం కావడం.. మొన్న పరకామణి.. నిన్న మద్యం బాటిల్స్ ఘటనలు జరగడంతో.. నిందితులపై కఠిన చర్యలకు దిగుతున్నారు. ఈ వ్యవహారంలో ఓ వైసీపీ నేతను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. తిరుమలలో కొందరు అధికారులు సైతం వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విషయాన్ని టీటీడీ గుర్తించినట్లు తెలుస్తోంది. భద్రతా సిబ్బందిపై కూడా పోలీస్ శాఖ నిఘా పెట్టింది. ఇటీవల గోవింద రాజు స్వామి ఆలయంపై ఓ అజ్ఞాత వ్యక్తిని ఎక్కించడంలో భద్రతా సిబ్బంది పాత్ర కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఇప్పుడు మద్యం సీసాల వ్యవహారాన్ని సిట్ కు అప్పగించాలని భావిస్తున్నారు. అటు కల్తీ నెయ్యిపై నెలాఖరుకు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ముగిసే అవకాశం కనపడుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్